ఢిల్లీ: సుప్రీం కోర్టు లో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అమరావతి భూముల వివాదం లో వ్యవహరంలో ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అమరావతి భూముల వ్యవహారంలో “ఇన్సైడర్ ట్రేడింగ్” జరిగిందని సి.ఐ.డి నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ను ఏపి హైకోర్టు కొట్టేసింది.
ఈ నేపథ్యంలో… ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు లో జగన్ ప్రభుత్వం ఎస్.ఎల్.పి దాఖలు చేసింది. ఇక ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీం కోర్టు వినిపించారు. అమరావతిలో ట్రాన్స్ ఫర్ ప్రాపర్టీ చట్టం అమలవుతోందని దవే సుప్రీం కోర్టుకు తెలిపారు. సుప్రీం కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని సమర్ధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఎస్.ఎల్.పి ని కొట్టివేసింది. దీంతో జగన్ ప్రభుత్వం వేసిన ఎస్.ఎల్.పి వృధా అయిపోయింది.