చర్మ సంరక్షణ విషయంలో మగవాళ్ళు చేయాల్సిన పనులు..

-

చాలా మంది మగవాళ్ళు చర్మాన్ని పెద్దగా పట్టించుకోరు. గడ్డం మీద ఉన్న శ్రద్ధ చర్మం మీద వారికి ఉండదు. అందుకే చర్మ సంరక్షణ విషయంలో తప్పులు చేస్తుంటారు. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మగవాళ్ళు చేయాల్సిన పనుల గురించి తెలుసుకుందాం.

శుభ్రత

ప్రతి రోజు చర్మాన్ని శుభ్రపర్చడం మంచిది. వాతావరణంలోని దుమ్ము, ధూళి చర్మానికి అతుక్కుంటుంది. ఒక్కోసారి ఇది సీబమ్ ఉత్పత్తికి కారణం కావచ్చు. అందువల్ల తరచుగా చర్మాన్ని శుభ్రపర్చడం ఉత్తమం. దీనికోసం సబ్బుకి బదులు అధిక గాఢత గల ఫేస్ వాష్ బాగా పనిచేస్తుంది. ఆడవాళ్ళలా మగవాళ్ళ చర్మం సున్నితంగా ఉండదు. కాస్త మందంగా ఉంటుంది కాబట్టి ఫేష్ వాష్ బాగుంటుంది. ఇంకా సన్ స్క్రీన్ లోషన్ ఖచ్చితంగా వాడాలి. SPF 50 లేదా అంతకంటే ఎక్కువ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి.

హైడ్రేషన్

చర్మాన్ని తేమగా ఉంచుకోవడం అనేది చర్మ సంరక్షణలో ప్రధానమైనది. దీనివల్ల కోల్పోయిన పోషకాలు చర్మాన్ని చేరతాయి. మాయిశ్చరైజర్ వాడేవాళ్ళు ఎప్పుడు వాడాలనేది కూడా తెలుసుకోవాలి. షవర్ చేసిన టవల్ తో తుడుచుకున్నాక కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

చర్మ సంరక్షణ ఉత్పత్తులు

ఈ ఉత్పత్తులు మహిళలకే కాదు పురుషులకూ ముఖ్యమే. ముందే చెప్పినట్టు పురుషుల చర్మం మందంగా ఉంటుంది కాబట్టి వారికి తగిన ఉత్పత్తులను ఎన్నుకోవాలి. చర్మ రకాన్ని బట్టి ఈ ఎంపిక ఉండాలి. ఖరీదైన ఉత్పత్తులు చర్మ సంరక్షణలే ఎక్కువ ప్రభావం చూపిస్తాయనే దానికి ఎలాంటి ఆధారం లేదు.

వర్కౌట్ తర్వాత చర్మ సంరక్షణ

వ్యాయామంలో చర్మంపై చెమటలు పట్టి రంధ్రాలు తెర్చుకుంటాయి. అందువల్ల వ్యాయామం తర్వాత చర్మాన్ని శుభ్రపర్చుకోవడం ఉత్తమం. చల్లని నీటితో ముఖం కడుక్కుంటే మరీ మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news