SBI Bank : జూలై ఒకటి నుండి కొత్త రూల్స్ …!

-

జూలై ఒకటి నుండి దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI Bank కొత్త రూల్స్ ని తీసుకు రాబోతోంది. తప్పక ఈ రూల్స్ ని స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ తెలుసుకోవాలి. ఇక బ్యాంక్ రూల్స్ సంబంధించి పూర్తి  వివరాల లోకి వెళితే..

SBI Bank | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
SBI Bank | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

చెక్ బుక్, ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ వంటి పలు అంశాలకు సంబంధించిన చార్జీలు మారుతున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. తప్పక వాటిని కస్టమర్స్ గ్రహించాలి లేక పోతే చిక్కులు తప్పవు.

ఇక ఆ కొత్త రూల్స్ గురించి చూసేస్తే.. ఈ రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు మాత్రమే వర్తిస్తాయి. ఏటీఎం నుంచి డబ్బులు నెలలో 4 సార్లు మాత్రమే ఎటువంటి చార్జెస్ పడకుండా తీసుకోవచ్చు. నాలుగు సార్లు దాటితే చార్జెస్ పడతాయి. అదే విధంగా బ్యాంక్ బ్రాంచుల్లో డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి కూడా ఇదే పరిమితులు వర్తిస్తాయి.

నాలుగు సార్లు దాటితే ప్రతి లావాదేవీకి రూ.15 చార్జీ పడుతుంది. ఇది ఇలా ఉంటే బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి డబ్బులు తీసుకున్నా కూడా లిమిట్ దాటితే ఇదే చార్జీలు పడతాయి. ఇక చెక్ బుక్ కి సంబంధించి రూల్స్ ని చూస్తే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే చెక్ బుక్ రూల్స్‌ను కూడా మార్చింది. అయితే బేసిక్ సేవింగ్స్ ఖాతాకు ఎస్‌బీఐ 10 పేజీల చెక్ బుక్‌ను ఉచితంగా అందిస్తుంది.

కాని తర్వాత ప్రతి చెక్ బుక్‌కు చార్జీలు చెల్లించుకోవాలి. 10 పేజీల చెక్ బుక్ తీసుకోవాలంటే రూ.40, 25 పేజీల చెక్ బుక్‌కు రూ.75, ఎమర్జెన్సీ చెక్ బుక్‌ కోసం రూ.50 కట్టాలి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. కానీ సీనియర్ సిటిజన్స్ కి ఈ రూల్స్ లేవు.

Read more RELATED
Recommended to you

Latest news