Unwanted facial hair: ఇలా చేస్తే ఇక ఈ సమస్య ఉండదు..!

-

కొందరికి వద్దనుకునే ఫేషియల్ హెయిర్ ఉంటుంది. ఇది నిజంగా వాళ్ళ యొక్క అందాన్ని చెడగొడుతుంది. అదే విధంగా చూడడానికి చాలా విరుద్ధంగా ఉంటుంది. కొందరు మహిళల్లో ముఖం మీద జుట్టు రావడం మనం గమనించే ఉంటాం. నిజంగా దీని వల్ల వాళ్లు ఎంతగానో సతమతమవుతూ ఉంటారు. అయితే ముఖం మీద జుట్టు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. పై పెదవి పైన జుట్టు రావడం, బుగ్గల మీద మగువలకు జుట్టు రావడం జరుగుతుంది.

అటువంటి మహిళలు ఇలా ఈ చిట్కాలను అనుసరించారు అంటే తప్పకుండా ఆ జుట్టును తొలగించుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. కేవలం మన ఇంట్లో ఉండే సామాన్లతో మనం ముఖం మీద వచ్చే జుట్టుని తొలగించొచ్చు. దీనికోసం మొదట రోజ్ వాటర్ తీసుకుని ముఖానికి అప్లై చేయండి. ఆ తర్వాత ముఖం పూర్తిగా ఆరే వరకు ఆగండి. ఇప్పుడు మీ జుట్టుని షవర్ క్యాప్ తో క్లోజ్ చేసి అలోవెరా ఫేస్ హెయిర్ రిమూవల్ మాస్క్ వేసుకోండి.

మీరు కావాలంటే దీనిని ముఖమంతా రాసుకోవాలి లేదు అంటే జుట్టు ఉన్న ప్రాంతంలో మాత్రమే రాసుకోవచ్చు. దీనిని రాసుకునేటప్పుడు ఖచ్చితంగా కళ్ళకి, పెదవులకి, కనుబొమ్మల కి అప్లై చేయొద్దు. ఇలా అలోవెరా జెల్ ని అప్లై చేసి పది నుంచి పదిహేను నిమిషాలు ఆగండి. ఒకసారి అది ఆరిపోయిన తర్వాత జుట్టు సైడ్ నుంచి ఊడి పోతున్నట్లుగా మీకు కనబడుతుంది అప్పుడు నెమ్మదిగా దానిని తొలగించండి ఇలా ఫేషియల్ హెయిర్ ని ఈజీగా తొలగించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news