తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల !

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల్లో సమూల మార్పులను తీసుకు వచ్చింది విద్యా శాఖ. ఈ ఏడాది రెండు టర్మ్స్ గా ఇంటర్ అకడమిక్ ఇయర్ ఉండనున్నట్లు పేర్కొంది. మొదటి టర్మ్  సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్ 18 వరకు ఉండనుండగా.. ఈ ఏడాది ఇంటర్ లో అర్థ సంవత్సరం పరీక్షలు నిర్వహించనుంది విద్యా శాఖ.

ఇక అక్టోబర్ 13 నుండి 17 వరకు దసరా సెలవులు ఉన్న నేపథ్యం లో డిసెంబర్ 13 నుండి 18 వరకు అర్థ సంవత్సరం పరీక్షలు పరీక్షలు నిర్వహించనుంది విద్యా శాఖ. అలాగే డిసెంబర్ 20 నుండి ఏప్రిల్ 13 వరకు సెకండ్ టర్మ్ ఉండనుంది.

ఇక జనవరి 13 నుండి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనుండగా.. మార్చి 23 నుండి ఏప్రిల్ 12 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనుంది విద్యా శాఖ. ఈ ఏడాది వంద శాతం సిలబస్ పూర్తి చేస్తామని.. సిలబస్ ఎలాంటి తగ్గింపు లేదని విద్యా శాఖ పేర్కొంది. దసరా లోపు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనుంది విద్యా శాఖ. ఇక విద్యార్థులు అందరు పరీక్ష రాయాల్సిందేనని…వీటికి నో ఆప్షన్ అని స్పష్టం చేసింది విద్యా శాఖ. ఇంటర్ అయిపోయిన విద్యార్థులకు ఇంప్రూవ్ మెంట్ రాసుకునే అవకాశం కూడా కలిపించింది…