బాదంనూనె, నల్లద్రాక్ష రసంతో మేలెంతో తెలుసా?

-

రోజూ గుప్పుడు డ్రైఫ్రూట్స్‌ తింటే ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతారు అందులో బాదంపప్పు కూడా ఒకటి. బాదంనూనె సేవించడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి తెలుసుకుందాం.

– రోజూ కూరల్లోకి రకరకాల వంటనూనెలు వాడుతుంటారు. కేరళావాళ్లు కొబ్బరినూనె వాడుతారు. వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది. మరి అన్ని రకాలు వాడే మన ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. అందుకు సరైన ఆయిల్‌ తీసుకోకపోవడమే. బాదంనూనె వాడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
– బాదంనూనెను నియమానుసారం సేవిస్తుంటే శరీరంలోని కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. దీంతో గుండెకు చాలా లాభం చేకూరుతుంది.
– మామూలు ఆయిల్‌ సేవించేవారికంటే బాదంనూనె సేవించే వారిలో నరాల బలహీనతకు బలాన్ని చేకూరుస్తుందంటున్నారు వైద్యులు.
– బాదంనూనె తీసుకుంటే మలబద్దకం మటుమాయమౌతుంది. అలాగే శరీరానికి బలం చేకూరుతుంది.
– బాదంనూనె రంగుతోపాటు రుచిని పెంచుతుంది. కుటుంబమంతటికి కూడా ఇది ఆదర్శవంతమైన టానిక్‌లా ఈ నూనెను వాడొచ్చు.

నల్లద్రాక్ష రసం ఉపయోగం

– చలికాలం వచ్చింది మార్కెట్లో నల్లద్రాక్ష హవా నడుస్తుంది. ముందే చలి, దానికితోడు నల్లద్రాక్ష సేవించడం ఎందుకులే అనుకుంటారు. అదే పొరపాటు. ఆరోగ్యవంతమైనవి ఏవీ ఆరోగ్యాన్ని హాని చేయవు. సీజన్‌కు తగినట్లుగా ఫ్రూట్స్‌ వాడకం ఎలాంటి పరిణామాలకు దారితీయదు.
– నల్లద్రాక్షలను తీసుకోవడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కాలేయానికి ఎండుద్రాక్షలు ఎంతో మేలు చేస్తాయి.
– రాత్రిపూట ఎండుద్రాక్షలను నానబెట్టి ఆ నీటితోపాటు ద్రాక్షాలన తీసుకోవడం ద్వారా కాలేయం శుభ్రమవుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు.
– దీంతో డయాబెటిస్‌ కూడా దూరంగా ఉంటుంది. నల్లద్రాక్ష రసం శ్వాసకోశాల్లో పేరుకుపోయిన కఫాన్ని ఇది తొలిగిస్తుంది. అందుకే చలికాలంలో నల్లద్రాక్ష రసాన్ని తీసుకోవడం ఆనారోగ్యానికి దూరంగా ఉండవచ్చు.
– శీతాకాలంలో పొడిదగ్గ ఉంటే.. బాదం గింజల్ని రెండు గంటలపాటు నీళ్లల్లో నానపెట్టి తీసేయవచ్చు. ఉల్లిగడ్డను దంచి, దాంట్లో నిమ్మరసం కలిపి, నీళ్లల్లో మరిగించి తీసుకుంటే త్వరితంగా ఉపశమనం లభిస్తుంది.
– పసుపుచెట్టు వేర్లను ఎండబెట్టి పొడిచేసి తేనెతో కలిపి తీసుకుంటే చలికాలంలో జలుబు, దగ్గు మాయమవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news