డయాబెటిస్‌ను అదుపు చేసే ఉసిరికాయలు..!

-

ఆయుర్వేదంలో ఉసిరికాయలకు చాలా ప్రాధాన్యత ఉంది. దీన్ని అనేక ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఇక భారతీయులు తమ ఇళ్లలో ఉసిరికాయలతో పచ్చళ్లు, పలు ఇతర వంటకాలు కూడా చేసుకుంటారు. అయితే ఉసిరికాయలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. త్రిఫలాల్లో ఒకటిగా దీన్ని ఆయుర్వేదంలో పిలుస్తారు. ఈ క్రమంలోనే ఉసిరి ఎన్నో వ్యాధులను నయం చేసేందుకు కూడా పనికొస్తుంది. అయితే డయాబెటిస్ పట్ల ఉసిరి సమర్థవంతంగా పనిచేస్తుందని పలువురు సైంటిస్టులు చేసిన తాజా పరిశోధనల్లో తెలిసింది.

 

ఉసిరిలో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని క్లోమగ్రంథిపై ప్రభావం చూపిస్తాయట. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయని వారు చెబుతున్నారు. ఉసిరిలో ఉండే క్రోమియం కార్బొహైడ్రేట్ల మెటబాలిజాన్ని సరిచేస్తుందట. దీంతోపాటు క్లోమ గ్రంథిలో విడుదలయ్యే ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకునేలా చేస్తుందట. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయని, ఫలితంగా డయాబెటిస్ కంట్రోల్ అవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.

సైంటిస్టులు ఉసిరికాయలు, డయాబెటిస్ అంశంపై చేసిన పరిశోధనను జర్నల్ ఆఫ్ మెడికల్ ఫుడ్‌లో ప్రచురించారు. ఇక డయాబెటిస్ మాత్రమే కాకుండా ఉసిరికాయల వల్ల అధిక బరువు తగ్గుతుందని, శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక నిత్యం ఉసిరికాయ పొడి లేదా జ్యూస్‌ను తీసుకుంటే పై సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని వారు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news