ఈ జ్యూస్‌ తాగితే దగ్గు పరార్‌!

-

శీతాకాలంలో జలుబు, దగ్గు సర్వసాధారణం. చలికి శరీరంలో ఉష్ణోగ్రత తక్కువవుతుంది. దీంతో జలుబు మొదలవుతుంది. దీనినుంచి దగ్గు వస్తుంది. జంబూబాంబ్‌, విక్స్‌తో జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. కానీ దగ్గు అలా కాదు. నిద్రపట్టనివ్వదు. పక్కవారిని నిద్రపోనివ్వదు. తరచూ వేధిస్తూ ఉంటుంది. దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు అరటిపువ్వు జూస్‌ తాగితే దగ్గు పరార్‌ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వివరాలేంటో తెలుసుకోండి.

అరటిపండులోనే కాదు అరటిపువ్వులోనూ ఔషధగుణాలున్నాయి. ఇది మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. షుగర్‌వ్యాధితో బాధపడేవారు అరటిపువ్వును శుభ్రం చేసుకొని సన్నగా తరిగి, చిన్న ఉల్లిగడ్డ, వెల్లుల్లి, మిరియాలు చేర్చి వేపుడులా తయారు చేసి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
– అరటిపువ్వులో శరీరంలోని ఇన్సులిన్‌ స్థాయిలను పెంచుతుంది. దీంతో డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు.
– దీన్ని పెసళ్లుతో ఆహారంగా కూడా తీసుకోవచ్చు. వారానికి రెండు మూడు రోజులైనా అరటిపువ్వును పెసళ్లతో కలిపి కూర చేసుకొని తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రత క్రమంగా ఉంటుంది.
– చాలామందికి అజీర్తి సమస్యలు ఎదురవుతుంటాయి. వాటి నుంచి బయటపడేందుకు వారానికి రెండుసార్లు అరటిపువ్వును డైట్‌లో చేర్చుకోవాలి.
– మహిళలో చాలామంది నెలసరి సమస్యలు, అధిక రక్తస్ర్తావం వంటి సమస్యలను ఎదుర్కొనే మహిళలు అరటిపువ్వు వంటకాలను తీసుకోవాలి. తెల్లబట్ట ఇబ్బందులను కూడా ఇది తగ్గిస్తుంది.
– చిన్నతనంలోనే కీళ్లనొప్పులంటూ హాస్పిటల్‌ చుట్టూ తిరుగుతుంటారు. వారికి అరటిపువ్వు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
– మధుమేహం, కీళ్లనొప్పులు, నెలసరి ఇబ్బందులు వీటన్నింటికంటే ముఖ్యంగా వర్షాకాలంలో వేధించే జలుబు, దగ్గుకు అరటిపువ్వు జ్యూస్‌ ఉపశమనాన్ని ఇస్తుంది.
– అరటిపువ్వు రసాన్ని మిరియాల పొడితో కలిపి తీసుకుంటే.. దగ్గు తగ్గిపోతుంది. జలుబు మాయమైపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news