మీరు కుండనీరు తాగుతున్నారా? ఒకవేళ మీ వద్ద మట్టికుండ లేకపోతే తెచ్చుకోండి. పూర్వం ప్రిజ్‌లు అందుబాటులో లేని కాలంలో మట్టికుండ నీరే తాగేవారు. ఇందులోని నీరు సహజ సిద్ధమైనవి. నీరు చల్లగా ఉంటుంది. అయితే, మట్టికుండ నీరు తాగటం వల్ల కలిగే ఆరు ప్రయోజనాలను తెలుసుకుందాం.
సహజసిద్ధంగా నీరు చల్లబడుతుంది
మట్టికుండలో నీరు సహజ సిద్ధంగా చల్లబడుతుంది. ఈ కుండలపై చిన్న రంద్రాలు ఉంటాయి దీనివల్ల వాటర్ ఎవాపరేట్ అవుతుంది. ఇది టెంపరేచర్‌ను తగ్గించి కుండనీరు చల్లగా ఉంచుతుంది.
ఆల్కలైన్
మనం తీసుకునే ఆహారంలో అధిక శాతం యాసిడిటిక్ ఫుడ్ ఉంటుంది. దీనివల్ల బాడీలో టాక్సిన్స్ పెరుగుతాయి. మట్టి కుండ సహజసిద్ధంగా ఆల్కలైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో మీ పీహెచ్ లెవల్‌ను బ్యాలన్స్ చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను నియంత్రిస్తుంది.
మెటబాలిజమ్ బూస్ట్
మట్టికుండ నీరు ప్రతిరోజూ తాగటం వల్ల బాడీ మెటబాలిజం బూస్ట్ అవుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. ఎందుకంటే ఈ నీటిలో మినరల్స్ ఉంటాయి.
వడదెబ్బ తగలకుండా..
ఈ హాట్ సమ్మర్‌లో వడదెబ్బ తగులుతుంది. ఈ సమస్య సర్వసాధారణం. కుండనీరు తాగటం వల్ల బాడీ రీహైడ్రేట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో పుష్కలంగా మినరల్స్ ఉంటాయి.
గొంతుకు మంచిదే
ఫ్రిజ్ వాటర్ తాగటం వల్ల గొంతు సంబంధిత సమస్యలు వస్తాయి. కుండనీరులో టెంపరేచర్‌కు తగ్గట్లుగా చల్లదనం ఉంటుంది కనుక ఇది గొంతు సమస్యలను దరిచేరదు.
నేచురల్ ఫ్యూరిఫయర్
మట్టి కుండ నీరు కేవలం నీటిని చల్లబరచడమే కాకుండా శుద్ధి చేస్తుంది. అందుకే ఈ నీరు తాగటం మంచిది.