ఈ ‘టీ’తో బరువు తగ్గండి!

-

బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్లి మరీ వర్కౌట్స్‌ చేస్తుంటారు. పనిలో యాక్టివ్‌గా ఉండేందుకు కాఫీ తాగుతారు. టీ తాగడం వల్ల బరువు తగ్గుతారని తెలుసా? ఇది పాలు, డికాషిన్‌ పెట్టే టీ కాదండోయ్‌. పార్స్‌లీ టీ. పార్స్‌లీ ఆకులు కొత్తిమీరలానే ఉంటుంది. ఇది ఎక్కడబడితే అక్కడ దొరుకదు కాబట్టి మార్కెట్లో పొడిని అమ్ముతారు. దీని వల్ల ఏం జరుగుతుందో చూద్దాం.

రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్‌లో హుషారుగానే నడుస్తారు. తర్వాత వేగం తగ్గుతుంది. ఇంకా కొంచెం దూరం పోగానే కాళ్లకున్న చెప్పులే బరువుగా అనిపిస్తాయి. దీంతో చెప్పుల్ని పక్కన వదిలి వట్టికాళ్లతోనే నడుస్తారు. ఇది మన చేతిలో పని కాబట్టి బాగానే ఉంటుంది. అదే శరీర బరువు పెరిగి నడవడానికి వీలులేకుండా మారితే పొట్టను తీసి పక్కన పెట్టగలమా. అది అసాధ్యం. ఇంట్లో వాళ్లు, చుట్టుపక్కలవాళ్లు, తెలిసిన వారు ఖర్చులేనిది కాబట్టి నోటికొచ్చిన సలహాలు ఇస్తుంటారు. ఇలా చేస్తే బరువు తగ్గుతారు. అలా చెయ్యి అని సర్టిఫికేట్లు ఇస్తుంటారు. చిప్పినవి చేసుకుంటూ పోతున్నా బరువు ఏమాత్రం తగ్గకపోగా, డైటింగ్‌పేరుతో నీరశించిపోతున్నారు. బరువు తగ్గించేందుకు పార్స్‌లీ టీ బాగా ఉపయోగపడుతున్నదని తాజా పరిశోధనల్లో తేలింది.

పార్స్‌లీ టీ : ఈ పేరు చాలామందికి కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎక్కడా దొరకదు. పార్స్‌లీ టీ పొడి, బ్యాగ్స్‌ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సూపర్‌మార్కెట్లో లభిస్తాయి. అమేజాన్‌ లాంటి ఈ-కామర్స్‌ సైట్లలో కూడా దొరుకుతున్నాయి. కాబట్టి.. ఆ టీ పొడి కొనుక్కొని వాడితే మంచిది. ఎందుకంటే పార్స్‌లీ ఆకుల్లో విటమిన్‌ ఎ, బి, సి, కె,తోపాటు ఐరన్‌, పొటాషియం, క్యాల్షియం, ఫాస్పరస్‌, ఫ్లేవనాయిడ్‌ క్వెర్సెటిన్‌ వంటివి ఉంటాయి. లక్కేంటంటే ఈ టీ తాగితే శరీరంలో వ్యర్థ కొవ్వులు మాత్రమే బయటకు పోతాయి. పోషకాల్ని నష్టపోవడం లేదు. మధుమేహం ఉన్నవారి రక్తంలో గ్లూకోజ్‌ లెవెల్స్‌ తగ్గించడంలో కూడా పార్స్‌లీ టీ ఉపయోగపడుతున్నది. గ్లూకోజ్‌ లెవెల్స్‌ సరిగా ఉన్నప్పుడు మన శరీర బరువు కూడా పద్ధతిగా ఉంటుంది. అప్పుడు లివర్‌ ఆరోగ్యంగా ఉంటుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ కూడా చక్కగా పనిచేస్తూ మనం ఆరోగ్యంగా ఉంటాం. అందువల్ల తీపి జ్యూస్‌లు, డ్రింకులు, పానీయాలు తాగేబదులు.. పార్స్‌లీ టీ తాగితే అన్నీ లాభాలే.

టీ తయారీ :
200 ఎమ్‌.ఎల్‌ నీటిలో పార్స్‌లీ టీ పొడి వెయ్యాలి. ఓ ఐదు నిమిషాలు సిమ్‌లో మరగనివ్వాలి. ఆ తర్వాత ఫిల్టర్‌ చెయ్యాలి. ఆ పార్స్‌లీ టీ నీరులో తీపి కొసం కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. ఈ టీని రోజూ రెండుసార్లు తాగుతై ఉంటే బయటకు తెలియకుండా లోలోపల శరీరంలో చెడుకొవ్వు అలా కరిగిపోతూ ఉంటుంది. కొన్ని రోజులకే బరువు తగ్గగలం అని పరిశోధకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news