పసుపు వల్ల ఉపయోగాలు..!

-

మన దేశంలో పసుపుకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. పసుపు మన భారత దేశంలో ఆరు వేల సంవత్సరాల నుండి అనేక వ్యాధుల నివారణకి, చర్మ సౌందర్యంగా, వంటింటి దినుసుగా వాడుతున్నారు. పసుపులో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. పసుపు లో చిన్నగాయాలు దగ్గర నుండి కాన్సర్ వ్యాధి వరకు నయం చేయగల ఔషధ గుణాలు ఉన్నాయి.మంచి క్రిమి సంహారిణి గా ఉపయోగపడుతుంది.

దగ్గు, జలుబు తో బాధ పడేవారు వేడి నీటి లో పసుపు వేసి మరిగించి ఆవిరి పడితే చక్కని ఫలితం ఉంటుంది. గొంతు నొప్పి, కఫం తగ్గడానికి రాత్రి పడుకునేముందు ఒక గ్లాస్ పాలలో కొంచెం పసుపు, మిరియాల పొడి కలిపి మరిగించి బెల్లం కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది. జామ ఆకులు పసుపు కలిపి మెత్తగా నూరి మొటిమలపై రాస్తే మొటిమలు తగ్గుతాయి.మెత్తటి పసుపులో మెత్తటి సాల్ట్ కలిపి టూత్ పౌడర్ గా వాడితే నోటి దుర్వాసన, పుచ్చు పళ్ళు, దంతాల నొప్పి తగ్గిపోతాయి. పసుపు కొమ్ముని మెత్తగా నూరి చర్మ వ్యాధులకు పై పూతగా వాడవచ్చు.

పాల మీద మీగడ, కొద్దిగా పసుపు, శనగ పిండి, గంధంపొడి కలిపి ముఖానికి ప్యాక్ లాగ వేసుకుంటే చర్మం నిగారిస్తుంది.పసుపు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. పసుపులో ఎన్నో సహజ సిద్ద ఔషధ గుణాలు ఉన్నాయి.  పసుపులో శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, లవణాలు, యాంటి ఆక్సిడెంట్ లు, యాంటిబయాటిక్ లు సమృద్దిగా ఉనాయి. ముఖ్యంగా కర్క్యుమిన్ అనే పదార్థం ఉంది. దీని వల్ల శరీర ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఉపయోగ పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news