ముక్కు నుంచి రక్తం కారుతోందా.. గులాభీ రేకులతో ఇలా చేయండి

-

ముక్కు నుంచి రక్తస్రావం, అల్సర్లు వంటి ఆరోగ్యసమస్యలకు కారణాలు చాలా ఉంటాయి. కొందిరి వేడి చేసి కూడా అలా జరగుతుంది..గుల్ కంద్ అనే తీపి పదార్థంతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా. అవును ఆరోగ్యనిపుణులు అంటున్నారు..గుల్ కంద్ అనే తీపి పదార్థం ద్వారా ముక్కు నుంచి రక్తస్రావం సమస్యను నివారించవచ్చట. పలురకాల స్వీట్లలో వాడే ఈ పదార్థం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు..అవేంటో..అసలు ఈ పదార్థం ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

రోజూ కాస్త గుల్​కంద్​ను తింటే అల్సర్సు, రక్తస్రావం వంటి సమస్యలను దూరం చేయొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఈ గుల్​కంద్​ను ఎలా తయారు చేసుకోవాలంటే

ఎండురోజా పువ్వు రేకులు, తేనె, పంచదార, యాలకపొడి దీనికి కావల్సిన పదార్థాలు..ఓ బౌల్​ తీసుకుని అందులో ఈ పదార్థాలు అన్నిటినీ లేయర్స్​గా వేసుకోవాలి. ముందుగా చక్కెర​ వేసి ఆపైన గులాబీ రేకులు వేయాలి. మళ్లీ పంచదార, ఆ పైన గులాబీ రేకులు వేసుకుంటూ చివరగా పైన పంచదారను వేయండి.

గులాబీ రేకులు, షుగర్​ సమాన స్థాయిలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ మూడు వారాలపాటు ఎండపెట్టాలి. అప్పటికి ఇది పాకంగా మారి జామ్​లా తయారవుతుంది. ప్రతిరోజు ఎండలో పెట్టి తీసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి.ఈ మిశ్రమం తయారయ్యాక అందులో రుచి కోసం తేనె, కాస్త యాలకపొడి కలుపుకుంటే గుల్​కంద్​ రెడీ. ఈ గుల్​కంద్​ మూడు నెలల వరకు నిల్వ ఉంటుందట. దీనిని రోజూ భోజనం తిన్న తర్వాత 3 నుంచి 5 గ్రాముల వరకు తీసుకోవచ్చు.

ప్రయోజనాలు ఏంటంటే..

గుల్కంద్​తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. గుల్కంద్​ తీసుకోవడం ద్వారా రక్తస్రావం, వేడి చేసి ముక్కలోంచి రక్తం కారడం వంటి సమస్యలకు చెక్​ పెట్టొచ్చు. అంతేకాదు.. అల్సర్స్​తో బాధపడేవారికి కూడా ఈ గుల్కంద్​ చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. యష్టిమధు పొడిని ఓ 2 గ్రాములు ఇందులో కలుపుకుని 15 రోజుల పాటు తీసుకుంటే అల్సర్స్​ తగ్గిపోతాయి. అయితే మధుమేహంతో బాధపడుతున్న వారు మాత్రం ఈ గుల్​కంద్​ తీసుకోవడానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అంతాబానే ఉంది కానీ.. కాకపోతే కాస్త లెంథీ ప్రాసెస్ కదా..ఓపిగ్గా చేసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయికదా..ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకుంటే..మార్కెట్ లో కూడా దొరుకుతుంది కాబట్టి తెచ్చుకుని వాడుకోవచ్చు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version