ఎక్కువ సేపు పాలు మరిగించద్దు..!

-

ఆరోగ్యానికి పాలు ఎంతో మేలు చేస్తాయి. పాలల్లో క్యాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్ మరియు ఇతర మినరల్స్ వంటివి ఉంటాయి. పోషక పదార్ధాలతో నిండి ఉన్న పాలు తాగడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఎముకలు కూడా పాలు తాగడం వల్ల దృఢంగా ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు పాలు మరిగించినప్పుడు చాలా మంది ఈ తప్పులు చేస్తారు.

ఈ తప్పు చేయడం వల్ల పాలల్లో ఉండే పోషక పదార్ధాలు పోతాయి. చాలా మంది పాలని ఎక్కువ సేపు మరిగిస్తూ ఉంటారు. అదే విధంగా మరిగించిన పాలని మళ్లీ మళ్లీ మరిగిస్తూ ఉంటారు. పాలు ఒకసారి మరిగిన తర్వాత కొందరైతే సిమ్ లో ఉంచి ఎక్కువసేపు మరిగిస్తూ ఉంటారు.

అయితే ఇలా చేయడం తప్పు అని అంటున్నారు నిపుణులు. ఎక్కువ సార్లు మరిగించిన పాలని మళ్లీ మళ్లీ మరిగించడం లేదా ఎక్కువ సేపు పాలని మరిగించి ఉంచడం వల్ల దానిలో ఉండే పోషక పదార్థాలు పోతాయి. దీని కారణంగా పాలు తాగడం వల్ల ఎటువంటి పోషక పదార్థాలు మనకి అందవు.

పాలను మరిగించే పద్ధతి:

పాలను మరిగించి సరైన పద్ధతి గురించి చూస్తే… పాలుని స్టవ్ మీద పెట్టి మరిగించి సమయంలో స్పూన్ తో కలుపుతూ ఉండండి. ఒక్కసారి పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే కానీ తిరిగి మళ్ళీ ధరించడం లేదా ఎక్కువసేపు మరిగిస్తూ ఉండడం లాంటివి చేస్తే పోషకపదార్థాలు కోల్పోవాల్సి వస్తుంది.

అదే విధంగా పాలు తాగేటప్పుడు చేప తో కలిపి తీసుకోవద్దు. అన్నం తిన్న వెంటనే కూడా మీరు పాలు తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.

ఒకవేళ కనుక మీరు పాలు తాగిన తర్వాత ఏమైనా తింటే అప్పుడు కొద్దిగా మాత్రమే తినండి. పాలతో పాటు ఉప్పగా ఉండే వాటిని తీసుకోకూడదు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news