వేడిపాలు, చల్ల పాలల్లో ఆరోగ్యానికి ఏది మంచిది..?

-

ప్రతి రోజు మీరు పాలు తాగుతారా..? అయితే వేడి పాలు (milk) తాగితే మంచిదా చల్లటి పాలు తాగితే మంచిదా అనేది ఇప్పుడు తెలుసుకోండి. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలల్లో కాల్షియం, విటమిన్-డి, పొటాషియం ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే చాలా మంది ఎక్కువగా వేడి పాలు తాగడానికి ఇష్ట పడుతూ ఉంటారు. కొంతమంది చల్లటి పాలు కూడా తాగుతూ ఉంటారు.

పాలు /milk
పాలు /milk

అయితే డాక్టర్ చెప్పిన దాని ప్రకారం వేడి పాలు తాగినా చల్లటి పాలు తాగినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే కొంత మంది పాలు తాగడానికి అస్సలు ఇష్టపడరు. కానీ పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి.

ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగే వాళ్ళల్లో ఎముకలు దృఢంగా ఉంటాయి. చల్లటి పాలని వేసవిలో తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. చలికాలంలో రాత్రిపూట పాలు తాగేటప్పుడు వేడి పాలు తాగితే వెచ్చగా ఉంటుంది. పాలల్లో ఉండే కాల్షియం, విటమిన్-డి, పొటాషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

వేడి పాలు తాగడం వల్ల కలిగే లాభాలు..?

వేడి పాలు తాగడం వల్ల సులభంగా జీర్ణం అయిపోతాయి. వేడి పాలు లేదా గోరువెచ్చని పాలు తీసుకోవడం వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది.

చల్లటి పాలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు..?

చల్లటి పాలల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎసిడిటీ కడుపునొప్పి వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. రాత్రి నిద్ర పోయేటప్పుడు తీసుకోకుండా ఉండటం మంచిది.

ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలానే దగ్గు, రొంప వంటి సమస్యలు కూడా ఇది తీసుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాత్రిపూట తీసుకోకుండా ఉండటం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news