షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ హీరో విశాల్‌

కరోనా మహమ్మారి నేపథ్యంలో సినిమా పరిశ్రమకు తీవ్ర నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ తరుణంలోనే చాలా సినిమాలు షూటింగ్ లు జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగానే తమిళ హీరో విశాల్ ఇప్పుడు తన 31వ సినిమా ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది.

అయితే ఈ షూటింగ్ సమయంలో హీరో విశాల్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గోడ తగలడంతో విశాల్ వెన్నుకు బలమైన గాయం అయింది. ప్రస్తుతం వైద్యులు చికిత్స చేస్తున్నారని…. విశాల ఆరోగ్యంగానే ఉన్నారని చిత్ర బృందం సభ్యులు పేర్కొన్నారు. శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విశాల్ సినిమా అంటే యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉంటాయని తెలిసిందే. ఇక ఇప్పటికే పలు సందర్భాల్లో హీరో విషయాలు గాయపడ్డారు. తాజాగా ఇవాల్టి షూటింగ్లో సమన్వయ లోపం కారణంగా హీరో విశాల్ గాయపడ్డారు.