చిరంజీవి టైటిల్‌తో.. కార్తికేయ గ్రాండ్ ఎంట్రీ

ఆర్ ఎక్స్ 100 ద్వారా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో కార్తికేయ‌. ఈయ‌న చేసిన సినిమాలు అన్నీ మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. కొన్ని ప్లాపులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కెరీర్‌లో ఏడో సినిమా చేస్తున్నాడు హీరో కార్తికేయ‌. ఆయ‌న రీసెంట్‌గా న‌టించిన చావుక‌బురు చ‌ల్ల‌గా ఎన్నో అంచ‌నాల న‌డుమ వ‌చ్చి ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

అయితే తాజాగా హీరో కార్తికేయ చిరంజీవి టైటిల్ తో మరో సారి థియేటర్లలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ”రాజా విక్రమార్క” పేరుతో కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ పోస్టర్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా బక్రీద్ మరో పోస్టర్ ను రిలీజ్ చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్లు ముస్లిం వేషధారణలో డిఫరెంట్ లుక్ లో కనిపించాడు హీరో కార్తికేయ. డిఫరెంట్ స్టోరీలైన్ తో రాబోతున్న ఈ మూవీని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ ఫస్ట్ మూవీ గా చిత్రీకరణ చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.