కంటి ఆరోగ్యానికి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ చెప్పిన చిట్కాలు..

-

మహమ్మారి మనుషులని కలవకుండా చేసి, ఫోన్లకి అతుక్కునేలా చేసింది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చేతిలో ఫోన్ పట్టుకుని కళ్ళని దానిమీదే ఉంచుతున్నారు. ఇక ఇంటి నుండి బయటకు వెళ్ళే అవకాశం లేకుండా ఇంటి నుండే పనులు జరుగుతున్నాయి కాబట్టి కంప్యూటర్లను వదలలేకపోతున్నారు. దీంతో కళ్ళమీద భారం ఎక్కువగా పడుతుంది. కావాల్సిన దానికంటే ఎక్కువసేపు ఎలక్ట్రానిక్ పరికరాల తెరల వైపు చుస్తున్నారు కాబట్టి, కంటిచూపు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కంటి ఆరోగ్యానికి సంబంధించిన వ్యాయామాలను పంచుకుంది. మంగళవారం టిప్ అని చెబుతూ ఇన్స్టాగ్రామ్ లో కళ్ళకి సంబంధించిన వ్యాయాలను వివరించింది. కంప్యూటర్ ముందు గానీ, ఫోన్ ముందు గానీ కూర్చున్న ప్రతీ ఒక్కరూ ప్రతీ 15నిమిషాలకి ఒకసారి ఈ వ్యాయామం చేయాలి. దీనిలో కళ్ళు మూసుకుని, చేతిమునివేళ్ళతో కన్నులమీద సవ్యదిశలో మూడు సార్లు తిప్పాలి. అలాగే అపసవ్య దిశలో తిప్పాలి.

ఆ తర్వాత కళ్ళు తెరిచేటపుడు మూడు సార్లు కళ్ళు మూస్తూ తెరవాలి. ఇంకా కంప్యూటర్ మీద ఎక్కువగా పనిచేసేవారు బ్లూ లైట్ ఫిల్టర్ అద్దాలని వాడడం మంచిది. దానివల్ల కంప్యూటర్ నుండి వచ్చి నీలికాంతి కళ్ళని చేరదు. తద్వారా కళ్ళు ఎక్కువగా అలసిపోవు. ఈ నీలికాంతి కళ్ళకే కాదు చర్మానికి కూడా హాని కలిగిస్తుంది అని తెలిపింది. ఇంకా కంటి ఆరోగ్యానికి పనికివచ్చే ఆహారాలైన ఆకు కూరలు, బీటా కెరాటిన్ అధికంగా ఉండే క్యారెట్లని ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news