మగువలకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధర

-

బంగారాన్ని కొనుగోలు చెయ్యాలని మీరు అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. మరొక సారి బంగారం ధరలు తగ్గాయి. ఇక దీనికి సంబందించిన పూర్తి వివరాల లోకి వెళితే.. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది తీపికబురు అని చెప్పొచ్చు. అలానే వెండి రేటు లో కూడా మార్పు లేదు స్థిరంగానే వుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

బంగారం

హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ.47,890కు క్షీణించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.90 తగ్గుదలతో రూ.43,900కు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్‌ లో మాత్రం బంగారం ధర పెరిగింది. 0.10 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1784 డాలర్లకు ఎగసింది.

ఇక వెండి గురించి చూస్తే.. వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.73,100 వద్దనే కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ఔన్స్‌కు 0.35 శాతం తగ్గుదలతో 25.93 డాలర్లకు తగ్గింది.

ఇది ఇలా ఉంటే ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు మొదలైనవి వీటిపై ప్రభావం చూపిస్తాయన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news