కరోనా ఉన్నా.. తల్లిపాలు తప్పనిసరి!

సెకండ్‌ వేవ్‌ కరోనా ధాటికి భారత్‌ మొత్తం విలవిల్లాడుతుంది. ఆరోగ్యం ఎంత ముఖ్యం ఇప్పుడు అందరికీ అర్థమైంది. ముఖ్యంగా ఈ మధ్యే జన్మనిచ్చిన తల్లులకు చాలా స్ట్రెస్‌ ఫీల్‌ అవుతున్నారు. ఎందుకంటే ఒకవేళ తమకు కరోనా ఉంటే, బిడ్డకు కూడా వస్తుందా? పాలు ఇవ్వాలా?వద్దా? అని ఆలోచనలో పడుతున్నారు.
ఈ సందేహాలకు ప్రముఖ సీనియర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌ మనికంటి నివృత్తి చేశారు. అదేంటో చూద్దాం.

కొత్తగా జన్మనిచ్చిన తల్లి నిస్సందేహంగా పాలు ఇవ్వచ్చని సూచించారు. ఒకవేళ తల్లికి కరోనా సోకితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పాలు ఇవ్వాలని తెలిపారు.


బ్రెస్ట్‌ఫీడింగ్‌ వల్ల నవజాత శిశువుకు ఎటువంటి రోగాలు రావు. అలాగే వారిలో యాంటీ బాడీస్‌ పెరిగి ఇమ్యూనిటీ పెరుగుతాయని డాక్టర్‌ శ్రీనాథ్‌ తెలిపారు.

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఇవ్వచ్చా?

కచ్చితంగా ఇవ్వాలి. పిల్లల్లో యాంటి బాడిస్‌ పెరిగి ఎటువంటి ఇన్ఫెక్షన్లు వచ్చినా పోరాడే శక్తి లభిస్తుంది. 6నెలల లోపు పిల్లలకు పాలు మాత్రమే ఇచ్చి, ఆ తర్వాత పాలతో పాటు ఇతర ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి.

బ్రెస్‌ పీడింగ్‌ తో తల్లి నుంచి బిడ్డకు కరోనా సోకుతుందా?

ఇప్పటి వరకు పరిశోధకుల పరిశోధనల ప్రకారం తల్లి పాల వల్ల బిడ్డకు కరోనా వచ్చిన కేసులు లేవు.

కరోనా లక్షణాలు లేదా కొవిడ్‌ సోకినా బ్రెస్ట్‌ ఫీడింగ్‌ కొనసాగించాలా?

అవును! తల్లి బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు మాస్కు ధరించి పాలు ఇవ్వాలి. అలాగే చేతులు సబ్బుతో కడుక్కోవాలి. ఇంటి ఫ్లోరింగ్‌ను తర చూ డిస్‌ఇన్ఫెక్షనరీ లిక్విడ్‌ క్లిన్‌ చేయాలి. మీ బెడ్‌కు కనీసం ఆరు అడగుల దూరంలో పిల్లల్ని ఉంచాలి. వీలైతే వేరే గదిలో పెట్టాలి.

బిడ్డ అనారోగ్యంగా ఉన్నా.. పాలు పట్టాలా?

మీ బిడ్డకు కరోనా వచ్చినా.. లేదా ఇతర ఏ వ్యాధి వచ్చినా తల్లిపాలు కచ్చితంగా ఇవ్వాలి. మీ యాంటి బాడీస్‌ పాల ద్వారా బేబీకి అందుతుంది.

తల్లికి చాలా అనారోగ్యంగా ఉంటే?

మీకు అనారోగ్యంగా ఉంటే పాలడబ్బా లేదా స్పూన్‌ ద్వారా పాలు తాగించాలి. అది కూడా తల్లిపాలే.