నువ్వుల నూనెతో చేసిన వంటలు మగవారు తినొచ్చా..?

-

నువ్వుల నూనే అనగానే.. దీపారాధన చేయడానికి అనుకుంటాం.. కానీ దీంతో ఇంకా చాలా చేయొచ్చు. నువ్వుల నూనెతో వంటకూడా చేసుకోవచ్చు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నువ్వులు పండించి..వాటితోనే ఆయిల్‌ చేసుకుని వంటల్లో వాడుకుంటారు. నువ్వుల నూనె మగవారికి బాగా మేలు చేస్తుంది. చాలామంది ఆ వాసన నచ్చక వంటలో వాడుకోరు కానీ వాడితే వచ్చే లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు కూడా..!
మగవారు కనీసం ఒక స్పూను నువ్వుల నూనెను ఆహారంలో కలుపుకుని తింటే చాలా మంచిది. వారికి వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. స్పెర్మ్ కౌంట్ తగ్గితే సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గిపోతుంది. నువ్వుల నూనె వల్ల స్పెర్మ్ నాణ్యత కూడా పెరుగుతుంది. బిడ్డ ఆరోగ్యకరమైన డీఎన్ఏతో పుట్టడానికి ఇది చాలా అవసరం.
ఆడవారికి కూడా నువ్వుల నూనె చాలా మేలు చేస్తుంది. సమయానికి రుతుస్రావం వచ్చేలా చేస్తుంది. అంతే కాదు ఆ సమయంలో వచ్చే సమస్యలను సైతం తగ్గిస్తుంది. చర్మవ్యాధులు, వాతం వంటివి రాకుండా అడ్డుకుంటుంది. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా నువ్వుల నూనెలోని పోషకాలు చాలా మేలు చేస్తాయి.
స్త్రీల జుట్టును ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. పిల్లలకు నువ్వుల నూనెతో వండిన ఆహారాన్ని పెట్టడం వల్ల బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఈ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చిన్నారులకు నువ్వుల నూనె వంటలు తినిపించడం చాలా ముఖ్యం. ఈ నూనెలో కాపర్, జింక్, ఐరన్, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి.
నువ్వుల నూనెను ఆయుర్వేద మందులలో, కాస్మోటిక్స్ తయారీలలో వీటిని వాడతారు. ఈ నూనెను తలకు పట్టించి మసాజ్‌చేస్తే తలనొప్పి ఇట్టే పోతుంది. తెల్ల జుట్టు రావడం తగ్గుతుంది. అదే శరీరానికి రాసుకుంటే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి.

బాలింతలకు..

ప్రసవం అయ్యాక బాలింతలకు నువ్వుల నూనెతో వండిన వంటకాలను తినిపించండ చాలా అవసరం.. దీని వల్ల తల్లి పాల ద్వారా బలమైన పోషకాలు బిడ్డను చేరుతాయి. బిడ్డ మెడ త్వరగా నిలబడడమే కాదు, ఎదుగుదల కూడా బావుంటుంది. అందుకే ప్రసవం అయ్యాక దాదాపు నాలుగు నెలల పాటూ నువ్వుల నూనెతో వండిన వంటలే పెట్టాలని పెద్దోళ్లు అంటుంటారు..
నువ్వుల నూనెలో వండిన వంటలు రెండు రోజులు తింటే త్వరగానే అలవాటయిపోతాయి. నువ్వులను గానుగలో ఆడించి తీసేది అయితే ఇంకా మంచిది. నువ్వుల నూనె వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వైద్యుల సలహా మేరకు మీరు ఓసారి వాడి చూడండి.!

Read more RELATED
Recommended to you

Latest news