చియా గింజలతో ఈ రోగాలను తగ్గించవచ్చా..?

-

చియా గింజలు చూడటానికి బూడిద మరియు తెలుపు రంగులో ఉంటాయి. చూడటానికి చిన్నగా ఉండే చియా గింజలు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా చెప్పవచ్చు. ఇవి చూడడానికి కొంచెం సబ్జా గింజల వలే ఉన్నా.. ఇవి పూర్తిగా భిన్నమైనవి. రోజూ ఒక స్పూన్ చియా గింజల్ని తీసుకోవడం వలన అనేక లాభాలను పొందవచ్చు.చియా విత్తనాలలో ఫైబర్, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్స్,విటమిన్ ఏ,బి,ఈ, డి,లతో పాటు మాంగనీస్, ఫాస్ఫరస్,క్యాల్షియం, జింక్, కాపర్,పొటాషియం, సల్ఫర్ నియాసిన్,థయామిన్ వంటి కణజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉన్నాయి.

చియా గింజల్లో ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తుంది. రెండు టీ స్పూన్ల చియాగింజల్లో 10 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాలను తగ్గించడంతోపాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే పెద్ద ప్రేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది.చియా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి.ఇవి శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ల భారీ నుండి కాపాడుతాయి. వయసు పైబడటం వల్ల వచ్చే వృద్ధాప్య ఛాయాలను తగ్గించి,శరీరాన్ని యవ్వనంగా ఉంచుతుంది. అలాగే కాన్సర్ కారకాల వృద్దిని నిరోధిస్తుంది.

చియా గింజల్లో క్యాల్షియం, సల్ఫర్,మెగ్నీషియం మాంగనీస్ సమృద్ధిగా లభిస్తుంది. ఈ పోషకాలు ఆరోగ్యవంతమైన బరువు పెరిగేందుకు సహాయపడతాయి. శరీరంలోని అధిక రక్తపోటు సమస్యను తగ్గించడంలో ఎంతో దోహదపడతాయి.చియా గింజల్లో ఫైబర్ మరియు ప్రోటీన్స్ అధికంగా లభిస్తాయి. వీటిని తినడం వలన పొట్ట నిండుగానట్లుగా ఉంటుంది.అందువల్ల తరచూ తినాలనె ఆలోచన ఉండదు. అందువల్ల అధిక బరువు మరియు స్థూలకాయ సమస్యలతో బాధపడే వారికి ఇది ఒక చక్కని ఫలితాన్ని ఇస్తుంది.

చియా గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో గ్రేట్ గా సహాయపడతాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నియంతరించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. అలాగే రక్తంలో ఇన్సులిన్ అసాధారణ స్థాయిలను నియంతరించడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో సమృద్ధిగా లభించే కాల్షియం మీ ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మ మరియు జుట్టును ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.అలాగే చియా గింజల్లో ఉండే పోషకాలు ఆకలి, నిద్ర,మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news