తినే విషయంలో ఏది పడితే అది కాంబినేషన్‌లో తినొద్దని పెద్దోళ్లు ఎప్పడూ చెప్తూ ఉంటారు. పొట్లకాయ తింటే గుడ్డు తినొద్దని, పాలకూర టమోటా కలిపి వండొద్దని, చేపలు తిన్నాక పాలు తాగొద్దని.. వీటికి. కారణాలు ఏంటో వారికీ పెద్దగా తెలియదు. వద్దని చెప్పాం కదా వద్దు అంతే అంటారు. పొట్లకాయ గుడ్డు ఒకేసారి తింటే అరగదు కాబట్టి అలా తినొద్దు అంటారు. మన డైజెషన్ సిస్టమ్ బాగుంటే తినొచ్చు.. ఏం కాదు. మరీ చేపలు, పాలు సంగంతి ఏంటి..? వీటిని కలిపి తీసకోవడం మంచిదేనా.?
పాలు, చేపల కాంబినేషన్ ఎంతో ప్రమాదకరం. ఈ కాంబినేషన్‌ను తినడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది. ఆయుర్వేదంలో చేప, పాలు రెండు విధాలుగా శరీరంలో ప్రభావం చూపిస్తాయి. పాలు కూలింగ్ ఎఫెక్ట్‌గా పని చేస్తే.. చేపలు హీటింగ్ ఎఫెక్ట్‌గా ఉంటుంది. వీటి కాంబినేషన్ బ్యాలెన్స్ చేయలేనివిగా ఉంటుంది. వీటిని కలిపి తీసుకుంటే శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అందుకే వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపి తినవద్దని ఆయుర్వేదంలో కూడా చెబుతారు.
విడివిడిగా అయితే ఇవి చాలా మంచివి. అంటే.. కాంబినేషన్ అంటే చేపల కూరలో పాలు పోసి వండటం అనుకుంటారేమో.. చేపలు తిన్న తర్వాత పాలు తాగడం అండీ. చేపలు తిన్న రోజు పాలకు దూరంగా ఉండమని నిపుణులు అంటున్నారు. మాంసాహారం పదార్థాల్లో చేపలు ప్రత్యేకమైనవి. దీనిలో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల వల్ల చేపను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు.
పాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిల్లల ఎదుగుదలకు పాలు చాలా అవసరం. డైలీ పడుకునే ముందు పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా పాలు తాగి పడుకోవడం అలవాటు చేసుకుంటే.. అసలు నిద్రలేమి సమస్యే ఉండదు. కానీ చాలామంది.. పాల వాసన నచ్చలేదని పాలను దూరం పెడతారు. వాసన నచ్చకపోతే అందులో ఏదైనా టేస్టీ పౌడర్ కలుపుకొని తాగండి..
మొత్తానికి చెప్పేది ఏంటంటే.. విడివిడిగా చూస్తే చేపలు, పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ వీటని ఓకే రోజు తీసుకోవడం వల్లే సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.