ఆరోగ్యకరమైన జీవనశైలిని కాపాడుకోవటంలో పోషకాహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. అయితే నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. నిద్రలేమి అనేక రకములైన నిద్ర సమస్యల్ల వలన కలిగే వ్యాధి. గాఢమైన నిద్ర రాకపోవడం, అవకాశం ఉన్నా కూడా నిద్ర పోలేకపోవడం దీని లక్షణాలు. నిద్రలేమి లేదా తగినంత నిద్ర లేకపోవడం అనేవి కేవలం నైట్ షిఫ్ట్లుపనిచేసే ఉద్యోగులకు మాత్రమే ప్రత్యేకం కాదు. ఇలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
అయితే నిద్ర లేకపోతే చాలా డేంజర్ అని పరిశోధనలో తేలింది. మనిషి రోజులో కనీసం 6 గంటలు నిద్రపోవాలి. 6గంటల కంటే నిద్ర తగ్గితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా షుగర్ బీపీ వ్యాధులతో బాధపడేవారికి నిద్రలేమితో క్యాన్సర్ వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక నిద్రలేమీతో 40 ఏళ్లు దాటిన వారికి గుండెజబ్బులు కూడా వస్తాయని పరిశోధనలో స్పష్టం చేశారు.