నోటి దుర్వాసన కి ఇలా చెక్ పెట్టండి..!

-

చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే నోటి దుర్వాసన తగ్గాలంటే ఈ టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఒక్క సారి వీటిని చూసేయండి. దీనితో మీరు ఎన్నో టిప్స్ ని తెలుసుకుని ఫాలో అయ్యిపోవచ్చు.

డీహైడ్రేషన్:

నోరు ఆరి పోవడం వల్ల నోటి నుండి దుర్వాసన వస్తుంది. అందుకనే డీహైడ్రేషన్ సమస్య లేకుండా ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండండి. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల నోరు ఆరిపోకుండా ఉంటుంది అలాగే చెడు స్మెల్ రాకుండా చూస్తుంది.

టొబాకో ప్రొడక్ట్స్:

స్మోక్ చేసే వాళ్ళల్లో ఎక్కువగా నోటి దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసన సమస్య నుండి బయట పడాలంటే వీటికి దూరంగా ఉండాలి. అలానే భోజనం చేసిన తరువాత జీలకర్ర నమిలితే కూడా నోటి దుర్వాసన సమస్య నుండి బయట పడవచ్చు. పైగా జీర్ణం కూడా బాగా అవుతుంది.

మెడికేషన్:

మీరు తీసుకునే మందుల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కొన్ని మందులు నోటిని బాగా డ్రైగా చేసేస్తాయి. దీని కారణంగా నోటి దుర్వాసన వస్తుంది. కాబట్టి ఏదైనా మందుల వల్ల మీకు వస్తుంది అనుకుంటే అప్పుడు మీరు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం వేసుకుని దానిని ప్రతి రోజు ఉదయం రాత్రి తీసుకోండి.

ఎక్కువగా ఆల్కహాల్ మరియు కాఫీ తీసుకోవడం:

ఎక్కువ కాఫీ మరియు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా నోటి నుండి దుర్వాసన వస్తుంది అని గమనించండి. అయితే నోటి దుర్వాసన సమస్య నుండి బయట పడాలంటే క్యారెట్, పాలకూర, కీరదోస, సిట్రస్ ఫ్రూట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. ఈ టిప్స్ ని కనుక మీరు ఫాలో అయ్యారు అంటే కచ్చితంగా ఈ సమస్య నుండి బయట పడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news