సిగరెట్ మాత్రమే కాదు.. సిగరెట్ పీక కూడా హాని చేస్తుందని తెలుసా..?

-

థియేటర్లో సినిమా మొదలయ్యే ముందు పొగతాగకూడదు, ధూమపానం హానికరం అన్న మాటలు మొదటగా వినిపిస్తాయి. ఆ మాటలు ఎంతమంది సీరియస్ గా తీసుకుంటారన్నది పక్కన పెడితే సిగరెట్ తాగడమే కాదు సిగరెట్ పీకలు కూడా హానిచేస్తాయని మీకు తెలుసా? అవును మీరు చదివింది నిజమే. ధూమపానం చేసేవారే కాదు పక్కన ఉన్నవారికి కూడా సమస్యలు ఎదురవుతాయని చిన్నప్పుడే చదువుకున్నాం. కానీ వాడి పారేసిన సిగరెట్ పీకలు కూడా హాని చేస్తాయని మీకు తెలుసా?

సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులు చెడిపోవడం మాత్రమే మానవ జీవన విధానం మీద బాగా ప్రభావం చూపిస్తుంది. సిగరెట్ లో ఉండే నికోటిన్, శారీరకంగా, మానసికంగా బలహీనపరుస్తుంది. వాడేసిన సిగరెట్ ని ఆష్ ట్రేలో ఉంచడం, బయటకి విసిరేయడం వల్ల దాన్లో ఉంటే నికోటిన్, గాలిలోకి ప్రవేశిస్తుంది. ఈ విషయమై అమెరికాకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు పరిశోధనలు జరిపారు.

దాని ప్రకారం సిగరెట్ పీకల్లో 15శాతం నికోటిన్ ఉంటుందట. అందువల్ల మన గదుల్లో కార్లలో సిగరెట్ పీకలని పడవేయడం వల్ల మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. మరో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, సిగరెట్ పీకల్ని ఆష్ ట్రేలో పడేసిన తర్వాత దాన్నుండి వచ్చే పొగ వారం రోజుల పాటు గాలిలో ఉంటుందట. ఈ లెక్కన మీరు సిగరెట్ తాగకపోయినప్పటికీ, సిగరెట్ అలవాటు ఉన్నవారితో స్నేహం చేస్తే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది యువకులపై, పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

ఈ నేపథ్యంలో సిగరెట్ పీకలని ఆష్ ట్రేలో గానీ, బయట విసిరేయడం గానీ చేయకుండా ఇసుకతో కప్పి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. సో.. పబ్లిక్ ప్లేసుల్లో పొగత్రాగడం మాత్రమే కాదు ప్రైవేట్ ప్లేసుల్లో సైతం సిగరెట్ పీకలు విసిరివేయవద్దని గుర్తుంచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version