కోకోనట్ డ్రైనట్ మిల్క్ షేక్.. ఇలా చేస్తే పిల్లలు అస్సలు వదిలి పెట్టరు..!

-

సమ్మర్ లో ఎప్పుడూ ఏదైనా కూల్ గా ఉండేవి తాగాలనిపిస్తుంది. మధ్యాహ్నం ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు.. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు.. ఇలా సమ్మర్ లో.. అవి ఇవి తాగే బదులు..ఆరోగ్యానికి మంచి చేసేవి తాగుతూ…కూల్ డ్రింక్స్ తాగాలనే కోరికను కూడా తీర్చేవి ఏవైనా ఉన్నాయా అంటే.. షేక్స్.. బనానా షేక్స్, మిల్క్ షేక్స్ గురించి మనకు తెలుసు. ఈరోజు ఇంకొంచెం కొత్తవి తెలుసుకుందాం.. కోకోనట్ డ్రైనట్ మిల్క్ షేక్, మ్యాంగో షేక్ ను హెల్తీగా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఎలా చేసుకోవాలో చూద్దామా..!

కోకోనట్ డ్రైనట్ మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

కోకోనట్ మిల్క్ 200Ml
బాదాం 20 గ్రాములు
జీడిపప్పు 20 గ్రాములు
తేనె ఒక టేబుల్ స్పూన్

తయారు చేసే విధానం..

బాదంపప్పును, జీడిపప్పు 7-8 గంటలు నానపెట్టాలి. ఖర్జూరం చేసుకోవడానికి గంట ముందు నానపెట్టాలి.. ఆ తర్వాత నానపెట్టిన బాదం, జీడిపప్పు, ఖర్జూరం మిక్సీలో వేసి పేస్ట్ లా చేయండి. అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె యాడ్ చేసుకోండి. మనకు కొబ్బరి పాలు ఎలా చేయాలో తెలుసు.. ఆ పాలను ముడు వంతులు మిక్సీలో వేసి మళ్లీ గ్రైండ్ చేయండి. పేస్ట్ అంతా.. కొబ్బరి పాలకు బాగా కలిసిపోతాయి. వాటిని గ్లాస్ లో వేసి.. మిగిలిస పాలను కూడా యాడ్ చేయండి. పైన కట్ చేసిన బాదం, జీడిపప్పు, పిస్తా వేసుకుంటే చాలు.. ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉంటే కోకోనట్, డ్రైనట్ మిల్క్ షేక్ రెడీ. పిల్లలకు మంచి బలాన్ని ఇస్తుంది. ఎలాంటి దగ్గు రాదు.

మ్యాంగో షేక్..

బయట మనకు దొరికే మ్యాంగో షేక్స్ లో ఎక్కువగా పంచదార యాడ్ చేస్తారు. దీనివల్ల మ్యాంగో వల్ల వచ్చే బెనిఫిట్స్ తగ్గి, పంచదార వల్ల వచ్చే సైడె ఎఫెక్ట్ ఎక్కువ అవుతాయి. ఈరోజు మనం చేసుకోబోయే మ్యాంగో షేక్ లో పంచదారనే వాడకుండా టేస్టీగా చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు..

మ్యాంగో 1
కొబ్బరి అరకప్పు
తేనె 2 టేబుల్ స్పూన్స్
జీడిపప్పు ముక్కలు ఒక టేబుల్ స్పూన్
బాదంపప్పు ముక్కలు ఒక టేబుల్ స్పూన్
యాలుకల పొడి ఒక టేబుల్ స్పూన్

తయారు చేసే విధానం..

పండిన మామిడికాయను తీసుకుని బాగా గుజ్జు తీయండి. కొబ్బరి బోండాల్లో ఉండే కొబ్బరి మీకు తెలిసే ఉంటుంది. అలాంటి కొబ్బరి ముక్కలు అరకప్పు వరకూ తీసుకుని మిక్సీలో వేసి, ఈ గుజ్జును కూడా వేసి రెండింటిని మెత్తగా గ్రైండ్ చేయండి. అందులో రెండు టేబుల్ స్పూన్ తెనే వేసి మళ్లీ గ్రైండ్ చేయండి. ఒక గ్లాస్ తీసుకుని అందులో జీడిపప్పు, బాదంపప్పు ముక్కలు, కొద్దిగా యాలుకల పొడి వేసి.. ఆ గ్లాసులో మ్యాంగో షేక్ కొంత వేసి.. మళ్లీ కొన్ని డ్రైనట్స్ ముక్కలు వేసి మళ్లీ గ్లాస్ నిండా మ్యాంగో షేక్ వేసి.. పైన కొంచెం తేనే వేస్తే సరి.. ఎంటో రుచిగా ఉండే.. మ్యాంగో షేక్ రెడీ.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news