కాఫీకి అంటే చాలమందికి ఇష్టం ఉంటుంది. అందులో కెఫిన్ ఉంటుంది తాగొద్దు అని ఎంత చెప్పినా వినరే..తాగాల్సిందే అంటారు. అయితే మీకు ఇష్టమైన కాఫీతోనే మీరు బరువుకూడా తగ్గే కొన్ని మార్గాలు ఉన్నాయి తెలుసా. ఎంచక్కా ఎలాంటి ఎక్సర్ సైజ్ లేకుండా..కాఫీ తాగి బరువు తగ్గొచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
1. డార్క్ లెమన్ కాఫీ
ఇప్పుడే ఈ కాఫీదే ట్రెండ్…ఈ కాఫీని నిమిషాల్లో ఎస్ప్రెస్సో షాట్, నిమ్మకాయతో తయారు చేయవచ్చు. దీని వలన కూడా అధిక బరువు తగ్గొచ్చని నిపుణులు అంటున్నారు. ఒక వేడి కప్పు ఎస్ప్రెస్సోలో నిమ్మరసం కలిపి ఈ కాఫీని తయారు చేస్తారు. నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడానికి ఎంతగానో సహాయపడుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
2. దాల్చిన చెక్క
ఒక కప్పు వేడి కాఫీకి చిటికెడు దాల్చిన చెక్కను పొడిని కలపాలి. ఈ మసాలా కాఫీ రుచి అన్ని కాఫీల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటంలో ఇది సహాయపడుతుంది, ఇది క్రమంగా బరువు తగ్గడంలో నూ ఉపయోగపడుతుంది.
ధమనులను తెరుచుకునేలా చేస్తుంది. అంతేకాకుండా ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ కాఫీలో ఒక టీస్పూన్ దాల్చినచెక్క పొడిని కలపండి. లేదా దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి, ఆపై దానిని కాఫీ డికాక్షన్ లో కలపండి అంతే..
3. వెన్న లేదా కొబ్బరి నూనె
దీన్నే బులెట్ కాఫీ అంటారు. కిటో డైట్ లో ఉన్నవాళ్లకు ఈ పదం కొత్తదేమి కాదు. దీన్ని ఉప్పు లేని వెన్న, పచ్చి కొబ్బరి నూనె వంటివి కాఫీలో కలిపి తయారు చేస్తారు. ఇది కాఫీని అధిక కేలరీలుగా చేస్తుంది. కడుపు నిండినట్లుగా అనిపిండం వల్ల.. ఏం తినాలనిపించదు. తిన్నా ఎక్కువగా తినాలనే కోరికరాదు.. వేగంగా బరువు తగ్గడంలో ఈ కాఫీ మరింత సహాయపడుతుంది. ఇందులో చెక్కరె, పాలు వాడకూడదు. ఈ కాఫీకి సంబంధించి సోషల్ మీడియాలో చాలా వీడియోలు అందుబాటు ఉన్నాయి. ఓ సారి చూడండి.
4. డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ లేదా తియ్యని కోకో యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గటంలో బాగా ఉపయోగపడతాయి. కెఫిన్, డార్క్ చాక్లెట్ కలయిక బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీ సాధారణ కాఫీ మిక్స్‌లో డార్క్ చాక్లెట్‌ని జోడించడం వల్ల ఆకలి బాధలను తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. అయితే ఈ చాక్లెట్ కాఫీలో చెక్కర వేయకూడదు.
5. జాజికాయ కాఫీ
జాజికాయ కాఫీ. జాజికాయలో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఇది మంచి డైటరీ ఫైబర్ కలిగి ఉంటుంది. వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జాజికాయ పౌడర్ చేసుకుని కాఫీతో కలిపి తీసుకోవచ్చు.
ఈ రకరకాల కాఫీలో ఏదో ఒకటి మాత్రమే ట్రై చేయండి. ఒకేసారి అన్నిరకాల కాఫీలు తాగేస్తే వేరే సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మీ రుచికి ఏది నచ్చితే అది మాత్రమే ప్రయత్నించగలరు.