కరోనా సమయంలో వచ్చిన పీరియడ్స్ సమస్యలకి రీసెర్చ్ అవసరం..!

-

కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు గాయత్రి కృష్ణ రాజ్ కి పీరియడ్స్ Periods ఉన్నాయి. ఆ సమయంలో కరోనా మహమ్మారి రెండవ వేవ్ ప్రజలుని పీడిస్తోంది. ఆ సమయంలో గాయత్రికి తీవ్ర జ్వరం, చెస్ట్ లో బరువుగా ఉండడం వంటి సమస్యలు వచ్చాయి. 60 రోజుల పాటు ఆమెకి బ్లీడింగ్ అయింది. సాధారణ సమయంలోనే ఆమె కి తక్కువ బ్లీడింగ్ అవుతుందట.

 

పీరియడ్స్ /Periods
పీరియడ్స్ /Periods

అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆమె డాక్టర్ని కన్సల్ట్ చేస్తే హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పడిపోయాయని చెప్పారు. ఇలా కరోనా మహమ్మారి సమయంలో గాయత్రి తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

రూప జైన్ పరిస్థితి ఎలా ఉందంటే రూప కి జూన్ 2020లో కరోనా వైరస్ మొదటి సారి వచ్చింది ఆ తర్వాత మళ్లీ నవంబర్ 2020 లో వచ్చింది. అయితే కరోనా రావడం వల్ల ఆమెకి ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నా.

యి తిరిగి సమయానికి పీరియడ్స్ రావాలని ఆమె అనుకుంటోంది. బాడీ పూర్తిగా కంట్రోల్ కోల్పోయిందని ఆమె చెప్పారు. కొన్ని కొన్ని సార్లు అయితే ఆమెకి 15 రోజులకె పీరియడ్స్ వస్తున్నాయట.

కొన్ని కొన్ని సార్లు అయితే పీరియడ్స్ చాలా ఆలస్యంగా వస్తున్నాయి. నిజంగా ఇటువంటి సమస్యలతో ఆమెకి ఒత్తిడి ఎక్కువైపోయింది. రీసెర్చర్లు ఎందుకు దీని కోసం ఆలోచించడం లేదు అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

నిజంగా తీవ్రమైన నొప్పి ఎదుర్కోవాల్సి వస్తోంది అని అన్నాడు. అలానే ఈ కడుపు నొప్పి కారణంగా సరిగా నిద్ర కూడా పోలేక పోతున్నాను అని ప్రియాంక సింగ్ లాగ నేను కూడా మంచం మీద నిద్రపోకుండా స్ట్రెచెస్ చేస్తూ కూర్చుంటున్నాను అని అన్నారు.

ప్రియాంకకి మూడ్ స్వింగ్ చాలా త్వరగా మారిపోతున్నాయి. అదే విధంగా ఏంగ్జైటీ కి కూడా ఎక్కువగా గురవుతున్నాను అని ఆమె చెప్పారు. ఈ మహమ్మారి కారణంగా పీరియడ్స్ లో చాలా మార్పులు వచ్చాయి అని ఆమె చెబుతున్నారు.

పీరియడ్స్ మరియు కరోనా వైరస్ మీద చేసిన స్టడీ చేస్తే మంచిదని అంతా అంటున్నారు. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి కేవలం ఒకే ఒక స్టడీ చేశారు. 177 మంది ఆడవాళ్ళ మీద స్టడీ చేయగా 45 మంది వాల్యూమ్ మార్పులతో ఇబ్బంది పడుతున్నారు.

50 మంది పీరియడ్ సైకిల్ మార్పులతో ఇబ్బంది పడుతున్నారు ఇలా చాలా సమస్యలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ స్టడీ చెబుతోంది వీటి కోసం కనుగొనడం నిజంగా చాలా ముఖ్యం. అయితే కరోనా అనేది కొత్త వైరస్ కనుక తప్పని సరిగా పీరియడ్స్ మీద కలిగే నెగటివ్ ఎఫెక్ట్ మీద రీసర్చ్ చేస్తే మహిళలకి సహాయంగా ఉంటుంది అని డాక్టర్ శెట్టి అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news