ప్రతి ఒక్క మహిళ హార్మోనల్ సైకిల్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. పీరియడ్స్ కి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు నిపుణులు మనతో చెప్పారు. వాటిని ప్రతి ఒక్క మహిళ తప్పక తెలుసుకోవాలి. దీని గురించి తెలిస్తే ఎప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి..?, మెడికేషన్ ఎప్పుడు అవసరం..? వంటి విషయాలు తెలుస్తాయి.
అసలు పీరియడ్స్ సైకిల్ అంటే ఏమిటి..?
సాధారణంగా పీరియడ్స్ అనేవి నెలకి వచ్చేది కాదు. 21 రోజుల నుండి 35 రోజుల వరకు ఎప్పుడైనా రావచ్చు. అయితే అందరికీ పీరియడ్స్ ఒకేలాగ ఉండవు. వాళ్ళ ఒంటి తీరును బట్టి పీరియడ్ డేట్ మారుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు పీరియడ్స్ ఇరవై నుండి ఇరవై మూడు రోజులకే వచ్చేయచ్చు. అలానే బ్లీడింగ్ లో కూడా మార్పులు వస్తాయి.
పీరియడ్స్ ఇర్ రెగ్యులారిటీ ఎందుకు ఉంటుంది..?
కొందరికి పీరియడ్స్ రెగ్యులర్ గా రావు. అప్పుడప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయి. అయితే ఇలా రావడం అనేది నార్మల్ కాదు అని ప్రతి మహిళా తెలుసుకోవాలి. ఓవాల్యుయేటింగ్ సరిగ్గా లేదని ఒంట్లో సమస్య ఉందని గుర్తించాలి. ఎక్కువ వ్యాయామం చేయడం, డైటింగ్ చేయడం వల్ల కూడా పిరియడ్స్ రావు అని నిపుణులు అంటున్నారు.
ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు..?
పిసిఒడి లేదా పిసిఓఎస్
హైపర్టెన్షన్
థైరాయిడ్
డయాబెటిస్
ఒత్తిడి లేదా ఎంగ్జైటీ
డిప్రెషన్
హై ప్రెషర్
ఆల్కహాల్ లేదా ధూమపానం
జీవన విధానంలో మార్పు రావడం
సరైన ఆహారం తీసుకోకపోవడం
ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి..?
పీరియడ్స్ సరిగా రెగ్యులర్ గా లేనప్పుడు డాక్టర్ ని తప్పకుండా కన్సల్ట్ చేయాలి. కనీసం మూడు నెలల నుండి మీకు పీరియడ్స్ రానట్టయితే అప్పుడు వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. మెనుస్ట్రువల్ క్యాలెండర్ ని మెయింటెన్ చేసి సమస్య కోసం తెలుసుకోవాలి.
చాలా మంది పీరియడ్స్ రాకపోతే పర్వాలేదులే అని వదిలేస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు. డాక్టర్ ని కానీ గైనికాలజిస్ట్ ని కానీ మీరు కన్సల్ట్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి.
పీరియడ్స్ సరిగ్గా రాకపోతే ఫర్టిలిటీ సమస్యలు వస్తాయా…?
పీరియడ్స్ సరిగ్గా రాకపోతే ఫర్టిలిటీ సమస్యలు వస్తాయి. అయితే పీరియడ్స్ సరిగ్గా రానట్టయితే ఇన్ ఫర్టిలిటీకి సూచన మాత్రం కాదు. ఒత్తిడి, ఎంగ్జైటీ మొదలైన కారణాల వల్ల కూడా పీరియడ్స్ రావు.
డాక్టర్లు పిసిఒడి సమస్య ఉందా పిసిఓఎస్ ఉందా లేదా హార్మోనల్ లో మార్పులు ఉన్నాయా వంటివి చూస్తారు. కాబట్టి ముందు ముందు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే తప్పకుండా మీరు మంచి వైద్యుల సలహా తీసుకుని దీని కోసం టెస్ట్ చేయించుకోవడం మంచిది. లేదు అంటే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.