తుమ్ముని ఆపితే ఈ సమస్యలు వస్తాయి తెలుసా…?

తుమ్ము వచ్చినప్పుడు ఆపుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు. నిజంగా తమ్ముని ఆపుకోవడం చాలా ప్రమాదం. అయితే తుమ్ముని ఆపుకుంటే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ సమస్యల గురించి ఇప్పుడు చూద్దాం.

 

చెవి సమస్యలు:

తుమ్ము వచ్చినప్పుడు ఆపుకుంటే మిడిల్ మరియు ఇన్నర్ ఇయర్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు తుమ్మును ఆపకుంటే ఖచ్చితంగా చెవి సమస్యలు వస్తాయి గుర్తుంచుకోండి. అందుకే తుమ్ముని ఆపడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చెయ్యద్దు.

ఇన్ఫెక్షన్స్:

తుమ్ము వచ్చినప్పుడు ఎప్పుడు ఆపుకోకూడదు. మీరు రొంప తో బాధపడుతూ ఉన్నట్లయితే తుమ్ము వచ్చినప్పుడు ముక్కు క్లియర్ అవుతుంది. అలానే బ్యాక్టీరియా కూడా తుమ్ము వలన శుభ్రం అవుతుంది. అదే ఒకవేళ కనుక మీరు తుమ్మినప్పుడు దానిని ఆపేస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని తెలుసుకోండి. కనుక ఎప్పుడు కూడా తుమ్ముని ఆపకండి.

బ్రోకెన్ రిబ్స్:

తుమ్మినప్పుడు మనకి ఎక్కువ ఫోర్స్ ఊపిరితిత్తుల నుంచి వస్తుంది. ఒకవేళ కనుక దానిని ఆపినట్లయితే రిబ్స్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మీకు తుమ్ము వచ్చినప్పుడు ఆపొద్దు లేదు అంటే ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అని గ్రహించండి.

అసలు మనకు తుమ్ము ఎందుకు వస్తుంది…?

తుమ్ము అనేది ఒక మెకానిజం. అయితే ఇది ముక్కుని క్లియర్ చేస్తుంది. ముక్కు లో దుమ్ము, ధూళి ఇతర పార్టికల్స్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ బ్రెయిన్ కి వెళ్తాయి. అప్పుడు తుమ్మమని ఇంఫార్మ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎప్పుడు తుమ్ము వస్తే అప్పుడు కచ్చితంగా తుమ్మేయాలి. అంతే కానీ ఆపుకోకూడదు.