ఏవోబీలో ఎదురుకాల్పులు… ముగ్గురు మావోయిస్టులు హతం ..

-

ఆంధ్రా, ఒడిషా బార్దర్ మరోమారు కాల్పులతో దద్దరిల్లింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. విశ్వసనీయ సమచారం మేరకు భద్రతా బలగాలు గాలింపు చేపట్టగ మవోయిస్టుల ఎదురైనట్లు తెలిసింది. దీంతో ఇరు వర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్ గిరి జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్ జరిగిన కేరిమితి గ్రామం రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. వీరి దగ్గర నుంచి 2 గన్నులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటన జరిగిన ప్రాంతంలో మరో 30-40 మంది మావోయిస్టులు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరి కోసం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రితో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు అధికారుల సమావేశం జరిగింది. మావోయిస్టులను ఏరివేయాలని సమావేశంలో స్పష్టం చేశారు. దీంతో ఏజెన్సీ ఏరియాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news