హన్మకొండలో రామ్ గోపాల్ వర్మ ర్యాలీ !

టాలీవుడ్ సంచలన, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఏదో ఒక విషయంపై ఎప్పుడు వార్తల్లో నిలుస్తారు. అంతేకాదు వివాదాస్పద సినిమాలను తీస్తూ కూడా రాంగోపాల్ వర్మ.. తన హైప్ పెంచుకున్నారు. ఇక ప్రస్తుతం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొండా అనే సినిమాను చేస్తున్నా రు. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేకత సాధించిన కొండా దంపతుల కథాంశం నేపథ్యంలో.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ.

ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్ ను కూడా విడుదల చేశారు రాంగోపాల్ వర్మ. ఇది ఇలా ఉండగా… తాజాగా హన్మకొండలో కొండ సినిమా చిత్ర బృందం పర్యటించింది. ఈ సందర్భంగా హనుమకొండ లో దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఘన స్వాగతం పలికారు కొండా సురేఖ దంపతులు. మొదట కొండా సురేఖ ఇంటికి వెళ్ళిన వర్మ.. అనంతరం ర్యాలీ నిర్వహించారు. వరంగల్ నుండి వంచనిగిరి వరకు ర్యాలీ నిర్వహించారు వర్మ. ఆ తర్వాత వంచన గిరిలో మీడియా తో వర్మ మాట్లాడే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలోనే వర్మ హనుమకొండ వచ్చినట్లు తెలుస్తోంది.