కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మాజీ మంత్రి కేటీఆర్ అన్ని అబద్దాలు చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు తమ్మిడి హట్టి వద్ద నిర్మించినట్టయితే ప్రాజెక్ట్ పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేదన్నారు. కేటీఆర్ సిల్లి మాటలు మాట్లాడారు. కేటీఆర్ మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కడితే ఒక లిప్ట్ తో ఎల్లంపల్లి వద్దకు వచ్చేది అన్నారు మంత్రి ఉత్తమ్.
రూ.38వేల కోట్ల ప్రాజెక్టును రూ.1లక్ష వరకు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లే కట్టారు.. వాళ్ల హయాంలోనే కూలిపోయిందని తెలిపారు. ఇరిగేషన్ శాఖ పై 21 అక్టోబర్, 2023న కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని తెలిపారు. ప్రాణహిత చేవెళ్లను ఆటకెక్కించి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు. ప్రజాధనాన్ని కేసీఆర్ వృధా చేశారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించినట్టు తెలిపారు. కేటీఆర్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను. కేటీఆర్ తన పేరు జోసప్ గోబెల్స్ గా మార్చుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్.