కెచెప్ తింటున్నారా..? అయితే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..!

సమోసా, పఫ్, నూడిల్స్ పిజ్జా మొదలైన వాటిలో కెచప్ వేసుకుని తినడం చాలా మందికి ఇష్టం మీరు కూడా ఎక్కువగా కెచప్ తింటూ ఉంటారా..? అయితే తప్పకుండా మీరు దీని గురించి తెలుసుకోవాలి. చిన్నపిల్లలు మాత్రమే కాదు ఈ రోజుల్లో పెద్ద వాళ్లు కూడా కెచప్ కి బాగా అలవాటు పడిపోతున్నారు. అయితే వాళ్లు తెలుసుకోవాల్సింది ఏమిటంటే…? తాజా టమాటాల నుండి అది చేయరు.

 

Ketchup

అయితే ఎక్కువగా దీనిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే కెచప్ తీసుకోవడం వల్ల నిజంగానే సమస్యలు వస్తాయా అని ఆలోచిస్తున్నారా..? అవునండి దీని వల్ల చాలా ఎక్కువ సమస్యలు వస్తాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం ఒక లుక్ వేసేయండి.

తక్కువ పోషక పదార్థాలు:

కెచప్ లో ఎటువంటి పోషక పదార్థాలు లభించవు. కనీసం ప్రోటీన్, ఫైబర్ కూడా ఇందులో మనకి దొరకదు.

హృదయ సమస్యలు:

ఎక్కువగా దీనిని తీసుకోవడం వల్ల హృదయ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది అని తెలుసుకోవాలి.

ఒబిసిటీ:

ఎక్కువ షుగర్ మరియు ఫ్రక్టోస్ కార్న్ సిరప్ వల్ల ఒబెసిటీ సమస్య వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కనుక దీనికి దూరంగా ఉండడమే మంచిది.

ఎసిడిటీ మరియు గుండెల్లో మంట:

టమాటా కెచప్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట ఎసిడిటి వంటి సమస్యలు కూడా ఇది దారితీస్తుంది. అలానే జీర్ణ సమస్యలు కూడా తీసుకు వస్తుంది. కాబట్టి దీనిని ఎక్కువగా తీసుకునే వాళ్ళు దీనికి దూరంగా ఉండండి. లేదు అంటే ఈ సమస్యలు తప్పవు.

మోకాళ్ళ నొప్పులు:

కెచప్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అలానే కిడ్నీ సమస్యలు కూడా దీని వల్ల వస్తాయి. ఎక్కువగా దీనిని తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఎలర్జీలు, శ్వాస సంబంధిత సమస్యలు కూడా కెచప్ తీసుకోవడం వల్ల వస్తాయి.