కేసిఆర్ గడిలను..బీజేపీ బద్దలు కొడుతోంది : బండి సంజయ్

బిజేపి పార్టీ బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ లో బీజేపీ గెలుస్తుందని మోదీ.. టిఆర్ఎస్ వైపు ఉన్నట్టుగా డిల్లిలో చక్కర్లు కొట్టి వచ్చాడని.. అమరవీరుల ఆత్మ బలిదానాలు కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు. ఫామ్ హౌస్ ప్రగతి భవన్ తప్ప కేసీఆర్ రాష్ట్రం లో పాలన పడకేసిందన్నారు. కేసిఆర్ గడిలను కుటుంబ పాలనను బీజేపీ పార్టీ బద్దలు కొడుతోంది. 2023 ఎన్నికలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 3లక్షల ఇళ్ళు కేటాయిస్తే కేసీఆర్ ఇచ్చింది పన్నెండు వేలు అని పేర్కొన్నారు.

బాబా సాహెబ్ అంబెడ్కర్ ను గౌరవించింది బీజేపీ పార్టీ అని.. బాబా సాహెబ్ జయంతికి వర్ధంతులు కేసిఆర్ కు గుర్తుకు రావని మండిపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశాడని…తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ ఇంస్టాల్ మెంట్ జీతాలు ఇస్తున్నాడని ఫైర్ అయ్యారు.

ధనిక రాష్ట్రమని అందరిని మోసం చేస్తున్నారని.. రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. కరోనాలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుంటే కేసిఆర్ ఏమి చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్టంలో టిఆర్ఎస్ పార్టీ దళితులను మోసం చేస్తుందని.. కుల వృత్తులను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఫైర్ అయ్యారు,