ఎక్కువగా తలనొప్పి వస్తోందా…? అయితే మీ సమస్య ఏమిటో ఇలా తెలుసుకోండి..!

-

ఏ వయసు వారికైనా తలనొప్పి వస్తూ ఉంటుంది. వయసు తో దీనికి సంబంధం లేదు. ఒత్తిడి వల్ల నొప్పిగా ఉంటుంది. అయితే చాలా మంది తలనొప్పి వస్తే పట్టించుకోరు. తలనొప్పి మన మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. ఇతర సమస్యలు లాగే తలనొప్పి కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటుంది. విపరీతంగా తల నొప్పి వచ్చినప్పుడు అది మన లైఫ్ స్టైల్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. తల నొప్పి రావడానికి ముఖ్య కారణం శారీరక ఒత్తిడి మరియు మానసిక ఒత్తిడి. అలానే ముఖం పై ఉంటే మజిల్స్ స్ట్రైన్ అవ్వడం వంటివి కూడా దీనికి కారణాలు.

Difference Between Headaches and Migraines – SAPNA Pain Management Blog

 

నుదిటి  మీద, తల వెనుక భాగం మీద ఎక్కువగా తలనొప్పి వస్తూ ఉంటుంది. టెన్షన్ కారణంగా వచ్చే తల నొప్పి ఒక రోజు కంటే ఎక్కువ ఉండదు. లేదా కొద్ది గంటల ఉంటుంది. కాసేపు నిద్ర పోయిన వెంటనే తగ్గిపోతుంది. ఇది ఒక రకం. దీనిలో మరో రెండు రకాలు ఉన్నాయి. మైగ్రేన్ మరియు సైనస్ తల నొప్పులు. ఇవి తగ్గడానికి కూడా చాలా సమయం పడుతుంది. పైగా నొప్పి కూడా విపరీతంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఎందుకు తలనొప్పి వస్తుంది..? అనే దాన్ని గమనించాలి.

అంతే కాని పిల్స్ వేసుకుని తగ్గించుకో కూడదు. నిపుణులు ఏం చెప్తున్నారు అంటే సైనస్ తలనొప్పి మరియు మైగ్రేన్ తలనొప్పికి తేడాలు చెబుతున్నారు. దీనిని తెలుసుకోవడం వల్ల మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సైనస్ తలనొప్పి అయినా మైగ్రేన్ తల నొప్పి అయినా వచ్చే లక్షణాలు కాస్త దగ్గరగా ఉంటాయి. తల బరువెక్కి పోవడం, జలుబు, ముఖంపై ఉండే మజిల్స్ మీద ఒత్తిడి పడటం వంటివి రెండిట్లోనూ వస్తూ ఉంటాయి.

మైగ్రేన్ వల్ల కనిపించే లక్షణాలు:

వికారం మరియు వాంతులు:

మైగ్రేన్ తలా నొప్పి వస్తే వికారం మరియు వాంతులు ఉంటాయి. దీని నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. ఫేషియల్ మజిల్స్ మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఒక రోజు అంతా కూడా
వాంతుల సెన్సేషన్ ఉంటాయి.

నాసల్ డిశ్చార్జ్ :

ముక్కులో నుంచి ఫ్లూయిడ్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది సాధారణ జలుబు లానే ఉంటుంది. ఇలా ఉంటూ తలనొప్పి రావడం మరియు ముక్కులో నుంచి వచ్చే మ్యూకస్ వాటర్ లాగ కనుక ఉంటే ఇది మైగ్రేన్ అని తెలుసుకోవాలి.

లైట్ సెన్సిటివిటీ:

లైట్లు లేదా సూర్యకిరణాలు పడితే వాళ్లకి చిరాకుగా ఉంటుంది మరియు కొద్దిగా తలనొప్పి ఉంటుంది. ఏదైనా సౌండ్ వంటివి ఏమైనా ఎక్కువగా ఉన్నా కూడా సఫర్ అవుతుంటారు.

సైనస్ వల్ల కలిగే లక్షణాలు:

బాడీ టెంపరేచర్:

సైనసైటిస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీనితో బాడీ టెంపరేచర్ కూడా పెరిగిపోతుంది. సైనస్ ప్రాంతం లో బ్యాక్టీరియా పెరిగిపోతే తలనొప్పి వస్తుంది.

మ్యూకస్:

ముక్కులో నుంచి వచ్చే మ్యూకస్ కొద్దిగా ఆకుపచ్చ లేదా పసుపు రంగు లో ఉంటుంది ఇది కొంచెం థిక్ గా ఉంటుంది. అలాగే కొద్దిగా తల నొప్పి కూడా ఉంటుంది.

చెవి లేదా పంటి నొప్పి:

సైనస్ వల్ల ఇబ్బంది పడినప్పుడు చెవి మీద లేదంటే పంటి పైన ఒత్తిడి పడుతుంది దీంతో తలనొప్పి కూడా ఉంటుంది. ఈ లక్షణాలు కనుక ఉంటే తప్పకుండా ఇది సైనస్ అని గ్రహించాలి.

Read more RELATED
Recommended to you

Latest news