బెల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని మనం వినే ఉంటాం. అయితే బెల్లాన్ని అందరూ తీసుకోవచ్చు కదా అనే భ్రమలో ఎక్కువగా మీరు కూడా బెల్లం తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఎందుకంటే ఈ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి బెల్లం అస్సలు మంచిది కాదు. ఆరోగ్యానికి బెల్లంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అసలు బెల్లం తినకూడదు. బెల్లం లో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. అలాగే ఇది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి అలాంటి బెల్లాన్ని ఎవరు తినకూడదు అని చూస్తే..
త్వరగా బరువు పెరిగి పోయేవారు:
త్వరగా బరువు పెరిగి పోయేవారు బెల్లం ఎక్కువగా తీసుకుంటే మరింత ఎక్కువ కేలరీలు అందుతాయి. దీని కారణంగా మరింత బరువు పెరిగిపోతారు.
బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి:
బెల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. షుగర్ లెవెల్స్ తో బాధపడే వాళ్ళు బెల్లం కి దూరంగా ఉండటం కూడా అవసరం.
అజీర్తి సమస్యలు:
అజీర్తి సమస్యలు ఉన్నవాళ్ళు కూడా బెల్లానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే బెల్లం తినడం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి కాబట్టి అజీర్తి సమస్యలతో బాధపడే వాళ్లు కూడా బెల్లానికి దూరంగా ఉండాలి. చూశారు కదా ఎవరెవరు బెల్లానికి దూరంగా ఉండాలని. మరి మీరు కూడా ఈ సమస్యతో బాధ పడితే బెల్లానికి తప్పక దూరంగా వుండండి.