యూపీలో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలు మరికొన్ని నెలల్లో వచ్చే ఏడాది జరుగనున్నాయి. అయితే వీటిలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జాతీయ పార్టీలకు కీలకంగా మారాయి. కాంగ్రెస్, బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ, బీెఎస్పీలకు కీలకం కానున్నాయి. అయితే ఈసారి యూపీలో పాగా వేసేందుకు కాంగ్రెస్ శతవిధాాల ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ యూపీలో పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల యూపీలో జరిగిన లఖీంపూర్ ఖేరీ ఘటనపై కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిరసను చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వినూత్న హామీలు ఇస్తూ ప్రజలకు దగ్గర కావాలని చూస్తోంది. ఇందు కోసం మహిళనలను, యువతను తమకు ఓట్లుగా మలుచుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో 40 శాతం సీట్లు మహిళలకే కేటాయిస్తామని వెల్లడించింది. ఇందుకు అనుగుణంగానే తాజాగా కాంగ్రెస్ మానిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చారు. ఈ మానిఫెస్టోను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విడుదల చేసింది. మహిళలు ఎప్పుడైతే రాజకీయాల్లో భాగస్వామ్యం అవుతారో అప్పుడే వారి సాధికారిత సాధ్యమవుతుందని ఆమె వెల్లడించారు. దేశానికి మొదటి మహిళా ప్రధానిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆమె అన్నారు. మా హామీలు కాగితాలకే పరిమితం కావని క్షేత్రస్థాయిలో ఇవి నిజమవుతాయని ప్రియాంకా గాంధీ అన్నారు.