తమిళనాడులోని కునూరు నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో… మొదట ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం… తాజాగా ఆ సంఖ్య 11కు చేరింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో cds జనరల్ బిపిన్ రావత్ తో పాటు… ఆయన భార్య మాలిక రావత్ … ఆయన కుటుంబ సభ్యులు, ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా… మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 14 మంది ఉండగా.. పదకొండు మంది మృతి చెందారు. అయితే మృతి చెందిన వారిలో బిపిన్ రావత్, అలాగే ఆయన భార్య ఉన్నారా ? లేదా ? అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. చనిపోయిన వారి డిఎన్ఎ పరీక్షలు చేసిన అనంతరం దీనిపై… కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్… ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ఈ ప్రమాదం నేపథ్యంలో… ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ అత్యవసర భేటీ అయింది. మరి కాసేపట్లోనే ఈ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది