కోపం, చికాకు వేధిస్తున్నాయా? కారణం ఇదే కావచ్చు..!

-

 

చాలా మందికి సర్వసాధారణంగా వద్దనుకున్నా వచ్చేవి కోపం, చికాకు, చిరాకు. ఇవి ఎందుకు వస్తాయో.. ఎప్పుడు వస్తాయో అర్థం కాదు. అవి అలా వస్తాయి.. ఇలా పోతాయి. ఇంత కోపాన్ని ప్రదర్శించింది నేనేనా అని తర్వాత బాధపడుతుంటారు చాలామంది. అయితే.. ఇలా కోపాలు, తాపాలు, చిరాకు, చికాకు లాంటివి రావడానికి ఓ బలమైన కారణం ఉందంట. అదేంటో తెలుసుకొని దాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే.. మీ కోపాలు, తాపాలు.. అన్నీ మాయమైపోతాయి.

అదే నిద్ర. అవును. నిద్రే. అదే అన్నింటికీ కారణం. రాత్రిళ్లు తక్కువగా నిద్రపోయే వారిలోనే ఈ కోపం, చిరాకు కనిపిస్తాయట. అంతే కాదు.. తక్కువగా నిద్రపోయేవాళ్లు తమదైన ఒక నెగెటివ్ ప్రపంచంలో జీవిస్తారట. ప్రతి చిన్న విషయానికి పెద్దగా అరుస్తుంటారు.. అంటూ చెబుతున్నారు పరిశోధకులు. అందుకే.. రాత్రిళ్లు కనీసం 7 గంటలు నిద్రపోవాలి. 7 గంటల కంటే తక్కువగా నిద్రపోయిన వాళ్లలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయట. 7 గంటలు, అంత కన్నా ఎక్కువగా నిద్రపోయిన వాళ్లలో కోపం, చిరాకు లాంటివి కనిపించట్లేదని పరిశోధకులు చెబుతున్నారు. మీకు కూడా కోపం, చిరాకు ఎక్కువగా ఉందా? అయితే.. మీరు చేయవలిసింది ప్రశాంతంగా నిద్రపోవడమే. అదే మీకు మందు.

Read more RELATED
Recommended to you

Latest news