అతిగా నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా

-

నిద్ర మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం .ఇది మీకు రోజంతా శరీరాన్ని చురుకుగా ఉంచడానికి తోడ్పడుతుంది మరియు అనారోగ్య సమస్యలను నివారిస్తుంది అయితే ఇలా అవసరానికి మించి అతిగా  నిద్రపోవడం కూడా చాలా ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. రోజుకు ఒక వ్యక్తి 8 గంటలు నిద్రపోతే చాలు ఇంతకంటే ఎక్కువసేపు పడుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను తెచ్చుకోవడమే .

నిద్ర పోతున్న సమయంలో శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. మన శరీరంలో ఉత్పత్తి అయ్యే సెరటోనిన్ హార్మోను మన నిద్ర మెళుకువ అయ్యే విధానాన్ని నియంత్రిస్తుంది, అతిగా నిద్రపోతే సెరటోనిన్ పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది ఇది న్యూరో ట్రాన్స్ మీటర్ లకు ఎంతగానో అంతరాయం కల్పిస్తుంది దీనికి కారణంగా తలనొప్పి ఈ సమస్య వస్తుంది అంతేకాకుండా ఎక్కువ ఆకలి వేయడం దాహం గా ఉండడం ఎక్కువ అవుతుంది.

రోజు మొత్తం బద్ధకంగా ఉండేలా చేస్తుంది డిప్రెషన్ లక్షణాలు కూడా వస్తాయి ఇలా మానసిక సమస్యలకు గురవుతారు అంతే కాకుండా దీని వల్ల డయాబెటిస్ అధిక బరువు సమస్యలు ఏర్పడతాయి. ఒక పరిశోధన ప్రకారం ఎక్కువసేపు పడుకునే వ్యక్తులు గుండె పోటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి రోజు నుంచి 8 గంటలు నిద్ర పోయే వారికంటే ఎక్కువ గంటలు నిద్రపోయే వారికి అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో తెలిసింది. ఏది ఏమైనా నిద్ర లేమితనంతో పాటుగా అతి నిద్రా కూడ అనారోగ్యానికి మూలంగా నిలుస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news