KGF 2 : “కేజీఎఫ్-2” ట్రైలర్ కు ముహుర్తం ఖరారు

-

కేజీఎఫ్‌ 2 మూవీ కోసం సినీ ప్రేక్షకులు దేశ వ్యాప్తంగా ఎంతగానే ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్‌ – 1 ఎంత పెద్ద విజయం సంపాదించిందో చూశాం. ఆ సినిమా రికార్డులు తిరగరాసింది. ఒక రకంగా చెప్పాలంటే సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసింది కేజీఎప్‌ -1. . సినిమాలో ద‌మ్ముంటే క‌ల‌క్ష‌న్ల వ‌ర్షం కురుస్తుంద‌ని నిరూపించింది. య‌ష్‌కు నేష‌న‌ల్ స్టార్ డ‌మ్ తీస‌సుకొచ్చింది.

ప్రస్తుతం య‌ష్ చాప్టర్ 2లో న‌టిస్తున్నాడు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్‌ వచ్చింది. కేజీఎఫ్‌ 2 ట్రైలర్‌ కు ముహుర్తం ఖరారు చేస్తూ.. అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. మార్చి 27 వ తేదీన సాయంత్రం 6.47 గంటలకు కేజీఎఫ్‌ 2 మూవీ ట్రైలర్‌ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు ఓ పవర్‌ ఫుల్‌ పోస్టర్‌ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. అలాగే.. ఏప్రిల్‌ 14 వ తేదీనే కేజీఎఫ్‌ – 2 విడుదల కానున్నట్లు మరోసారి స్పష్టం చేసింది చిత్ర బృందం. ఇక ఈ అప్డేట్‌ తో..హీరో యశ్‌ ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news