షుగ‌ర్ పేషంట్లు ఆల్క‌హాల్ తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా..

-

డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్న వారు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. షుగర్‌ రావడానికి ప్రధానమైన కారణాలు ముఖ్యంగా అధిక బరువు, ఆహార అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం ఇలాంటి వాటి వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు వ‌హించాలి. ఇష్టంగా తినే స్వీట్ల జోలుకి వెళ్ల‌కుండా కార్బోహైడ్రేట్లు త‌క్కువ‌గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నో ఆహార నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది.


నిజానికి బరువు తగ్గడం వల్ల డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతూ అధిక బరువు ఉన్నవారు రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారట. దీర్ఘకాలికంగా ఈ మార్పు గమనించ‌వ‌చ్చు. అయితే అదే పనిగా పెట్టుకుని తాగడం వ‌ల్ల అనేక జ‌బ్బుల బారిన ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. మితంగా ఆల్క‌హాల్‌ సేవించిన వారు మాత్రమే బరువు తగ్గినట్టు ఓ పరిశోధనలో తేలింది.

ఇక, డ‌యాబెటిస్ కంట్రోల్ చేయ‌డానికి ముఖ్యంగా యోగా కానీ, వాకింగ్‌ కానీ ఎక్సర్‌సైజులు కానీ చేయాలి. ఇవి చేయలేని వారైతే ప్రాణాయామం, సిట్టింగ్‌ ఎక్సర్‌సైజెస్‌ కానీ చేయవచ్చు. డయాబెటీస్‌ డైట్‌లో ఫైబర్‌, ప్రొటీన్స్‌ ఎక్కువ శాతంగా ఉండాలి. ఫైబర్‌ అంటే పీచు పదార్థం ప్రొటీన్స్‌ అంటే శక్తి కోసం తీసుకోవాలి. చక్కెర వ్యాధిని కంట్రోల్‌ చేయడానికి దానిమ్మ గింజలు, ఆకులు మరియు బెరడు కషాయాన్ని వాడ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news