చికెన్‌ను ఇష్టంగా లాగిస్తున్నారా?ఈ పొరపాట్లు మాత్రం అస్సలు చెయ్యకండి..

-

నాన్ వెజ్ ప్రియులు చికెన్‌ను ఇష్టంగా తింటారు.. ఎన్నో రకాల డిష్ లను చేసుకోవడం మాత్రమే కాదు..కూర నుంచి ఫ్రై, బిర్యాని వరకూ చేసుకొని తింటారు.చికెన్ తినాలనుకుంటే మంచిదే.. కానీ.. కొన్ని పదార్థాలతో కలిపి తినకూడదన్న విషయం చాలా మందికి తెలియదు..చికెన్ ను తీసుకోవడం లో కొన్ని పొరపాట్లు మాత్రం అస్సలు చెయ్యకూడదని నిపుణులు అంటున్నారు… అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

 

చాలా మంది ప్రతిదానికీ పెరుగు వేసుకుని తింటారు. సాధారణంగా పెరుగు రుచిని పెంచుతుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కొంతమంది చికెన్‌తో పెరుగు కూడా తింటారు. పెరుగు ప్రభావం చల్లగా ఉంటుంది.. కానీ చికెన్ ప్రభావం వేడిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చికెన్, పెరుగు కలిపి తినడం జీర్ణక్రియపై చెడు ప్రభావాన్ని చూపుతుంది..అందుకే చికెన్ తో పెరుగును కలిపి తీసుకోవడం మంచిది కాదు..

ఇకపోతే పాలతో చికెన్ తినడం అస్సలు మంచిది కాదని.. విషంలా వ్యాప్తి చెందుతుందని పేర్కొంటున్నారు. పాలు, చికెన్ కలిపి తీసుకుంటే శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా, శరీరంలో అలెర్జీలు సంభవించే అవకాశం ఉంది. పాలు, చికెన్ కలిపి తింటే చర్మ సమస్యలు పెరుగుతాయి. చికెన్ తో పాలు తినడం వల్ల చాలా మందికి దద్దుర్లు, తెల్లమచ్చలు, దురద వంటి సమస్యలు వస్తాయి.ఇంకా గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

చికెన్ తో చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. చికెన్, చేపలు రెండింటిలో కూడా ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండింటిలోనూ వివిధ రకాల ప్రోటీన్లు కనిపిస్తాయి. ఈ ప్రోటీన్ శరీరంపై ప్రతిచర్యకు కారణమవుతుంది. దీని వల్ల అలెర్జీ లాంటి సమస్యలతో పాటు శరీరానికి హాని కలుగుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని కలిపి తీసుకోవడం మంచిది కాదు..
శరీరంలో అలెర్జీ, ప్రతిచర్యకు కారణమవుతుంది. ఇంకా తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం కావచ్చు. ఈ మధ్య తందూరి చికెన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు తేల్చి చెప్పారు..ఏది ఏమైనా చికెన్ ను తీసుకోనే తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి..మితంగా తీసుకుంటే ఆరోగ్యం..అమితంగా తింటే విషం అని మర్చిపోకండి..

Read more RELATED
Recommended to you

Latest news