దిండు కింద మొబైల్ ఫోన్ ని ఉంచి నిద్రపోతున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవట..!

చాలా మంది నిద్రపోయే ముందు సెల్ ఫోన్ ని దిండు కింద పెట్టుకొని నిద్ర పోతూ ఉంటారు. అయితే నిజానికి అలా తలకింద సెల్ ఫోన్ ని పెట్టుకుని నిద్రపోతే సమస్యలు వస్తాయి. మీ ఛాతి మీద కానీ దిండు కింద కానీ సెల్ ఫోన్ ని పెడితే చాలా ప్రమాదం.

ఇది బ్రెయిన్ పై నెగటివ్ ఎఫెక్ట్ పడేట్టు చేస్తుంది. పైగా ఎంతో ప్రమాదం కూడా. అయితే ఈ విధంగా తలకింద ఫోన్ పెట్టుకుని నిద్ర పోయే వాళ్ళకి ఇటువంటి సమస్యలు తప్పవు. మరి ఆ సమస్యల గురించి ఇప్పుడు చూద్దాం.

క్యాన్సర్ మరియు ట్యూమర్స్ సమస్య:

తలకింద సెల్ ఫోన్ ని పెట్టుకొని నిద్ర పోవడం వల్ల క్యాన్సర్ మరియు ట్యూమర్స్ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అలవాటు ఉన్న వాళ్ళు మానుకోవడం మంచిది.

నిద్రలేమి సమస్య:

రాత్రిపూట మెలటోనిన్ అనే ఒక హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మనం నిద్ర పోయేటప్పుడు చేస్తుంది. కానీ ఒకవేళ కనుక తలకింద ఫోన్ ని పెట్టుకుంటే రేడియేషన్ పెరుగుతుంది. దీంతో ఆ హార్మోన్ ఉత్పత్తి అవ్వదు. ఈ కారణంగా నిద్రలేమి సమస్య వస్తుంది.

ఒత్తిడి పెరిగిపోతుంది:

మొబైల్ ఫోన్ కి రాత్రిపూట దూరంగా ఉండటం మంచిది. లేదు అంటే ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర పోయినప్పుడు కూడా ఒత్తిడి కలుగుతుంది.

డిప్రెషన్:

రేడియేషన్ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. దానితో డిప్రెషన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

డయాబెటిస్ మరియు హృదయ సంబంధిత సమస్యలు:

నిద్ర పోయేటప్పుడు ఫోన్ ని తల కింద పెట్టుకోవడం వల్ల డయాబెటిస్ మరియు హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అలవాటును మానుకోండి లేదంటే ఈ సమస్యలు తప్పవు.