మీ పిల్లలకు పాలంటే అసహ్యమా? కాల్షియం ఎక్కువగా ఉండే ఈ ఆహారాలు చూడండి.

చిన్నపిల్లలకు పోషకాహారం అందించడం ప్రతీ తల్లిదండ్రుల ముఖ్యమైన బాధ్యత. పోషకాహారాలు ఎక్కువగా గల ఆహారాల్లో పాలు కూడా ఒకటి. అందులో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని ఇవ్వడంతో పాటు పెరుగుదలలో చాలా సాయపడుతుంది. ఐతే చాలామంది పిల్లలు పాలంటే అసహ్యం చూపుతారు. కొంతమందికి పాల వాసన కూడా నచ్చదు. మరి ఇలాంటప్పుడు అందులోని పోషకాలు వారికి అందవు. అందువల్ల ఇతర కాల్షియం ఉన్న ఆహారాలను పిల్లలకు అందించాలి. అవేంటో ఇక్కడ చూద్దాం.

 

సోయాబీన్

సోయాబీన్ లో అనేక పోషకాలు ఉంటాయి. కాల్షియం అధికంగా ఉంటుంది. దీన్ని అనేక రకాలుగా ఆహారంగా తీసుకోవచ్చు. సోయా మిల్క్ కూడా ఉంటుంది.

ఆకు కూరలు

ఆకు కూరలైన పాలకూర, తోటకూర మొదలైన వాటిల్లో కాల్షియం ఉంటుంది. మీ పిల్లలకు ఆకు కూరలను అలవాటు చేయండి. ఒక రోజులో రెండు చెంచాల ఆకు కూరలు మీ పిల్లలకు అనేక పోషకాలను అందిస్తాయి.

నారింజ

నారింజలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అదీగాక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కావాలంటే తక్కువ చక్కెర కలుపుకుని ఆరెంజ్ జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు.

ఓట్ మీల్

విటమిన్ -బి, అధికంగా గల ఓట్ మీల్ లో కాల్షియం అధికంగా ఉంటుంది. సోయా మిల్క్, బాదం మిల్క్ తో ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల అధిక ప్రయోజనాలు పొందవచ్చు.

గింజలు, విత్తనాలు

వీటిల్లో 60నుండి 100మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. అందుకే సాయంత్రం పూట స్నాక్స్ లాగా వీటిని తీసుకోవడం ఉత్తమం.