బ్రేక్ ఫాస్ట్ విషయంలో చేసే ఈ పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేయకండి..

-

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకునేవారు బ్రేక్ ఫాస్ట్ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. పొద్దున్న చేసే బ్రేక్ ఫాస్ట్.. రోజంతా మీ మూడ్ ని డిసైడ్ చేస్తుంది. అందుకే మార్నింగ్ మీల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నిపుణులు నొక్కి వక్కానిస్తుంటారు. అయితే కొన్నిసార్లు బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా పొరపాట్లు చేస్తుంటారు. అవేంటో తెలుసుకుని.. ఎందుకు అలాంటి పొరపాట్లు చేయకూడదో అర్థం చేసుకుందాం.

బ్రేక్ఫాస్ట్ చేయకపోవడమే పెద్ద పొరపాటు:

ఈ పొరపాటు మీరు మాత్రం అస్సలు చేయవద్దు. వరుసగా కొన్ని రోజులపాటు మీరు మార్నింగ్ ఏమీ తినకుండా డైరెక్ట్ గా మధ్యాహ్నం పూట మాత్రమే తింటే మీ శరీర జీవ క్రియ దెబ్బతింటుంది. దానివల్ల బాడీలో లేనిపోని సమస్యలు వస్తుంటాయి.

ఫైబర్ ని ఇంక్లూడ్ చేసుకోకపోవడం:

శరీరంలో కొవ్వును తగ్గించి, రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించే శక్తి ఫైబర్ కి ఉంది. ఒక రోజులో ఒక మనిషికి 25 నుండి 38 గ్రాముల ఫైబర్ అవసరం ఉంటుంది. ఉదయాన్నే ఫైబర్ ఉన్న బ్రేక్ఫాస్ట్ చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

చక్కెర ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్ వద్దు:

ఇంట్లో కాకుండా బయట దొరికే పాన్ కేక్స్ ఇన్ స్టాంట్ ఓట్ మీల్ వంటి వాటిని బ్రేక్ ఫాస్ట్ లో ఇంక్లూడ్ చేసుకోకండి. వీటిల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు బలహీనంగా తయారవుతారు.

కాఫీ ముట్టుకోవద్దు:

భారతదేశంలో పొద్దున లేవగానే కాఫీ తాగడం అలవాటు అందరికీ ఉంటుంది. కానీ ఖాళీ కడుపుతో కాఫీ తీసుకోవడం వల్ల లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి. ముఖ్యంగా గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలానే ఉదయం జ్యూస్ లాంటివి కాకుండా ఘన పదార్థాలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version