ఉదయాన్నే కాళీ కడుపునా వీటిని తింటే అంతే సంగతులు…!

-

ప్రతిరోజు ఉదయం తప్పకుండా అల్పాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అదే విధంగా ఆరోగ్యానికి హానికరమైన వాటిని తీసుకుంటే అనారోగ్యం సంభవిస్తుంది. అయితే ఖాళీ కడుపున వీటిని అస్సలు తీసుకోవద్దు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి వాటి కోసం ఇప్పుడే చూద్దాం..

ఖాళీ కడుపున ఫ్రూట్ జ్యూస్లు తాగద్దు:

ఉదయాన్నే చాలా మంది ఫ్రూట్ జ్యూస్లు తాగుతూ ఉంటారు. ఖాళీ కడుపున పంచదార ఉండే ఈ ఫ్రూట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల గుండె లో ఓవర్ లోడ్ అయిపోతుంది.

తీపి పదార్థాలు:

వీటిని ఉదయాన్నే ఖాళీ కడుపున తీసుకోవద్దు. ఉదయాన్నే అల్పాహారం సమయంలో స్వీట్స్ షుగర్ ఉండే వాటిని తీసుకోవడం మంచిది కాదు. మీకు ఈ అలవాటు ఉంటే మానుకోవడం మంచిది.

స్పైసీ ఫుడ్ తీసుకోవడం:

ఖాళీ కడుపున పచ్చిమిర్చి స్పైసీగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది కాదు. దీని వల్ల ఇరిటేషన్, గ్యాస్, క్రామ్ప్స్ వంటివి వస్తాయి.

పుల్లటి పండ్లు తినొద్దు:

ఖాళీ కడుపున పుల్లగా ఉండే పండ్లు కాని లిక్విడ్స్ కానీ తీసుకోవడం మంచిది కాదు. దీని వల్ల గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.

సలాడ్స్:

అదేవిధంగా సలాడ్స్ కూడా తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే కూరగాయలతో చేసిన సలాడ్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపున వీటిని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news