ఫ్రిజ్ లో కోడి గుడ్లు, టొమాటోలు అసలు వద్దు…!

-

చాలా మందికి ఫ్రిజ్ లో కూరగాయలను పెట్టే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ రోజులు కూరగాయలు నిల్వ ఉంటాయి అనే ఉద్దేశంతో చాలా మంది ఫ్రిజ్ లో దాస్తూ ఉంటారు. అయితే అది అన్ని కూరగాయలకు అసలు వర్తించదు అంటున్నారు. టమోటాలు, గుడ్లు పెట్టడం వల్ల అవి పాడైపోతాయని నిపుణులు అంటున్నారు. దీనిపై నిపుణులు అనేక పరిశోధనలు కూడా చేసి ఈ విషయం చెప్పారు.

వీటిని వీలైనంత వరకూ ఫ్రిజ్‌లో పెట్టకుండా ఉండడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఫ్రిజ్‌లో టమోటాలు పెడితే అవి గట్టిగా మారిపోయి వాటికి ఉండే సహజ రుచిని కోల్పోతాయని అంటున్నారు. మామూలుగా గది ఉష్ణోగ్రతలో ఉన్న టమోటాల కంటే ఫ్రిజ్‌లో పెట్టిన టమోటాలు అంత రుచిగా ఉండవు. వాటికి పులుపు అనేది ఎక్కువగా అవుతుందని అంటున్నారు. కాబట్టి ఫైజ్ లో టమాటాలు వద్దని అంటున్నారు.

ఇక కోడి గుడ్డు విషయానికి వస్తే… అదే విధంగా గుడ్లని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల లోపలి భాగం పాడైపోయి పై పెంకుపై బ్యాక్టీరియా ఫామ్ అవుతుందని చెప్తున్నారు. ఉడికిన తర్వాత రుచిగా ఉండవని అంటున్నారు. ఇక అనారోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా కోడి గుడ్డు, టమాటోలను ఫ్రిజ్ లో పెట్టవద్దని అది అంత మంచిది కాదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news