ఇవి తింటే బరువు పెరగమన్నా పెరగరు..!

-

Eat this food to lose weight and not to gain weight

 

అవును.. చాలామందికి కన్ఫ్యూజన్. బరువు పెరగకూడదంటే ఏం తినాలి.. ఏం తినకూడదు.. ఏది తింటే బరువు పెరుగుతారు.. ఏది తినకపోతే బరువు పెరగరు.. ఇలా వంద ప్రశ్నలు వస్తుంటాయి. అయితే.. మీరు ఈ ఆహార పదార్థాలు తింటే బరువు పెరగమన్నా పెరగరు. ఎక్కువ బరువు ఉంటే తగ్గుతారు. మరి ఆ ఫుడ్డేదో తెలుసుకుందామా..

కోడిగుడ్డు.. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించే ఆహారం. కాకపోతే గుడ్డును ఆమ్లేట్లు, కూర లాగా తినడం కంటే… ఉడకబెట్టుకొని తినాలట. అలా అయితే బరువు తగ్గుతారట. కోడిగుడ్డులో ఉండే ల్యూసిన్ అనే అమైనో యాసిడ్ బరువు తగ్గించడానికి దోహదపడుతుందట.

దానిమ్మ గింజలు.. వీటిని ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకోవాలట. వాటిని ఎన్న తింటే అంత మంచిదట. అంతే కాదు.. కొన్ని దానిమ్మ గింజలను తినగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. దీంతో వేరే ఆహారం తీసుకోకుండా ఉంటారు.

చాలామంది కూరలు వండేటప్పుడు ఏ ఆయిల్ వాడుతారు అనేది పట్టించుకోరు. చాలామంది సన్ ఫ్లవర్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్, ఇంకా రకరకాల ఆయిల్స్ వాడుతుంటారు. కానీ.. కూరల తయారీకి ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే.. బరువు తొందరగా తగ్గుతారట. ఆలివ్ ఆయిల్ లో మోనో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి శరీరంలోని చెడు కొలెస్టరాల్ ను తగ్గిస్తుందట. అంతే కాదు.. మంచి కొలెస్టరాల్ పెరగడానికి దోహదపడుతుందట.

ఇక.. నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు.. చికెన్, మటన్ జోలికి పోకుండా… చేపలు తింటే బెటర్. ఎందుకంటే.. చేపల్లో కొవ్వు ఉండదు. క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.

వెజిటేరియన్లు… కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా వీటిని తీసుకోవడం వల్ల తొందరగా కడుపు నిండినట్టు అనిపించడమే కాకుండా.. కావాల్సిన పోషకాలు మాత్రమే అందుతాయి. దీంతో బరువు పెరిగే అవకాశమే ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news